- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్‌ఆర్‌ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కష్టకాలంలో ఒకరికొకరు సహకరించుకోవాలి: మంత్రి ఎర్రబెల్లి
దిశ, వరంగల్: కష్టకాలంలో ఎవరి కోసమో ఎదురు చూడకుండా ఒకరికొకరు సహకరించుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో స్వామి వివేకానంద యువజన సంఘం, మైత్రీ వెల్ఫేర్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ప్రైవేట్ హైర్ బస్సుల డ్రైవర్లు, క్లీనర్లు, నిరుపేదలు 300 మందికి నిత్యావసర సరుకులను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఎన్‌ఆర్‌ఐ గందె శ్రీధర్ ఆధ్వర్యంలో విలేకరులకు నిత్యావసర కిట్లు, శ్రీవాణి సోషల్ సర్వీస్ సొసైటీ డాక్టర్ నాగవాణి ఆధ్వర్యంలో 70 మంది ఆశా వర్కర్లకు నిత్యావసర సరుకులు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న కుటుంబ సభ్యులను ఆదుకున్న విధంగానే సమాజంలో పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కరోనా మరణాలు, వ్యాప్తి విషయంలో మిగతా దేశాలు, రాష్ట్రాలతో పోలిస్తే మనం ఎంతో మెరుగ్గా ఉన్నామని మంత్రి వివరించారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనే దాకా ప్రజలంతా లాక్‌డౌన్ నిబంధనలు తప్పకుండా పాటించాలని తెలిపారు.
Tags: minister errabelli dayakar, lockdown, everyone help eachother, nessecities supply