రైతు రాజ్యం-రైతు ప్రభుత్వం..!

by Shyam |   ( Updated:2020-09-24 04:03:25.0  )
రైతు రాజ్యం-రైతు ప్రభుత్వం..!
X

దిశ ప్రతినిధి మహబూబ్ నగర్: తెలంగాణలో రైతు రాజ్యం, రైతు ప్రభుత్వం నడుస్తోందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలో మంత్రి నిరంజన్ రెడ్డి రైతు సమన్వయ సమితి సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో అశాంతికి కారణం భూ సమస్యలనే విషయాన్ని గుర్తించి.. వాటి పరిష్కారం కోసమే ప్రభుత్వం రెవెన్యూ చట్టం తీసుకొచ్చిందని అన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో వనపర్తి నియోజకవర్గానికి రైతులకు సాగునీరు అందించామని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. కరోనా ఇబ్బందులలో కూడా అన్ని రంగాలు అతలాకుతలం అయినా సీఎం కేసీఆర్ పంటలు మద్దతు ధరకు కొనుగోలు చేసి వ్యవసాయ రంగానికి చేయూతనిచ్చారని గుర్తు చేశారు.

Advertisement

Next Story

Most Viewed