జీవో 217పై టీడీపీ రాద్దాంతం చేస్తోంది : మంత్రి అప్పలరాజు

by srinivas |
జీవో 217పై టీడీపీ రాద్దాంతం చేస్తోంది : మంత్రి అప్పలరాజు
X

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ నేతలపై మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 217పై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ జీవో మత్స్యకారులను దెబ్బతీసేలా ఉందని టీడీపీ విమర్శించడం దారుణమన్నారు. జీవో 217పై అపోహలు సృష్టించి రాజకీయ లబ్ధిపొందేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ప్రతి జిల్లాలో ఫిషింగ్ జెట్టీలు ఏర్పాటు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకొచ్చారు. అలాగే ఆయా ప్రాంతాల్లో స్థానిక మత్స్యకారులకు లీజుకు 582 చెరువులు ఇచ్చామని.. 28 జలాశయాల్లో ఫిషింగ్ లైసెన్సులు జారీ చేసినట్లు వెల్లడించారు. మత్స్యకారుల ఆదాయం పెంచడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని మంత్రి అప్పలరాజు తేల్చి చెప్పారు.

Advertisement

Next Story