- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏ పంట సాగు చేయాలో చెప్పిన మంత్రి ఎర్రబెల్లి
దిశ, వరంగల్: బీజేపీ, కాంగ్రెస్ లపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అదేవిధంగా తెలంగాణలో ఏ పంటలు సాగుచేయాలో అనే అంశంపై క్లారిటీ ఇచ్చారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, పెద్దవంగర, జనగామ జిల్లా కొడకండ్ల, దేవరుప్పుల మండల కేంద్రాల్లో ముస్లింలకు పండుగ రోజు వస్తువులతో కూడిన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు దిక్కులేదని, పంటలకు కనీస మద్దతు ధర వచ్చే పరిస్థితి లేదని మండిపడ్డారు. బీజేపీది బొంద మీది ప్యాకేజీ.. రాష్ట్రాన్ని కుదవ పెడితే అప్పులిస్తరట.. కరోనా కష్టకాలంలో ఆదుకోవాల్సింది పోయి అక్కరకు రాని ప్యాకేజీలు ప్రకటించారని విమర్శించారు. సీఎం కేసీఆర్ తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. రైతుల కల్లాల ప్లాట్ ఫారాలకు ఈజీఎస్ నిధులు కేటాయించినట్లు తెలిపారు. ప్రభుత్వం చెప్పిన విధంగా, షుగర్ ఫ్రీ తెలంగాణ సోనానే సాగు చేద్దామన్నారు. మక్కలు ఈ సారికి అసలు సాగు చేయొద్దని, దేశంలో తెలంగాణ పత్తికి మంచి డిమాండ్ ఉందన్నారు. మహబూబాబాద్ మిర్చీ, పల్లికి కూడా డిమాండ్ ఉందని, ఆ పంటలనే సాగు చేయాలని ఆయన పేర్కొన్నారు.