- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మల్లారెడ్డి కాలేజీలో ముగిసిన మైనింగ్ సదస్సు..
దిశ, న్యూస్‌బ్యూరో : ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో లభించిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మైనింగ్ రంగంపై అధ్యాపక శిక్షణా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని మల్లారెడ్డి గ్రూపు విద్యాసంస్థల డైరెక్టర్ డా. రామస్వామి రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ రవీంద్ర అన్నారు. నగరంలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల, మైనింగ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఇంటర్నెట్ వేదికగా ‘స్లోప్ అండ్ డంప్ స్టెబిలిటీ ఇన్ ఓపెన్ పిట్ మైన్స్’ అన్న అంశం పై ఈ నెల 3 నుంచి 8వ తేదీ దాకా ఆన్‌లైన్‌లో నిర్వహించిన శిక్షణా కార్యక్రమం ముగింపు సభలో వారు ప్రసంగించారు. ముగింపు కార్యక్రమ ముఖ్య అతిథిగా సింగరేణి సంస్థ మాజీ ముఖ్య కార్య నిర్వహణాధికారి కే.జే అమర్ నాధ్ మాట్లాడుతూ.. పరిశ్రమ సహకారంతో ఏర్పాటు చేసిన ఇలాంటి శిక్షణా కార్యక్రమాల ఆవశ్యకతను వివరించారు.
ఆరు రోజుల శిక్షణా కార్యక్రమంలో చర్చించిన వివిధ అంశాలను క్లుప్తంగా వివరించారు. గౌరవ అతిథి, జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ కార్య నిర్వాహక సంచాలకులు బి. సాహూ మాట్లాడుతూ.. కార్యక్రమ నిర్వహణలో కళాశాల చూపిన చొరవను ముఖ్యంగా మైనింగ్ విభాగాధిపతి డా. శ్రీనివాస్, కార్యక్రమ సమన్వయకులు ఆచార్య వెంకట్రామయ్య చేసిన ప్రయత్నాలని కొనియాడారు. ఇనుము ఖనిజ గనుల్లో స్లోప్ మరియు డంప్ స్టెబిలిటీ ప్రాధాన్యతను వివరించారు. భవిష్యత్తులో గనులపైన సైస్మిక్ తరంగాల ప్రభావం అన్న అంశంపైన శిక్షణా కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.
ఆ అంశంపై శిక్షణా కార్యక్రమానికి జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ తన వంతు సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. విశిష్ట అతిథి, ఉస్మానియా విశ్వవిద్యాలయ సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డా. ఆంజనేయ ప్రసాద్ మాట్లాడుతూ.. మైనింగ్ ఇంజినీరింగ్ విద్యా బోధనలో మరియు పరిశోధనలో కళాశాలలకు పరిశ్రమలు తమ సహాయ సహకారాలు అందించాలని సూచించారు. జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ కార్యనిర్వహాణాధికారి జయపాల్ రెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణ సంబంధమైన విషయాల గురించి చర్చించారు. మల్లారెడ్డి ఇంజనీరీంగ్ కళాశాల భవిష్యత్తులో నిర్వహించే శిక్షణా కార్యక్రమాలకు తమ సంస్థ పరిపూర్ణంగా సహకరిస్తుందని సింగరేణి సంస్థ మానవ వనరుల విభాగం కార్య నిర్వహణాధికారి రామలింగేశ్వరుడు అన్నారు.
ఐఐటీ ఖరగ్ పూర్, ఎన్ఐటీ సూరత్కల్, ఎన్ఐటీ రౌర్కేలా, డీజీఎమ్‌ఎస్, సింగరేణి సంస్థ, జేఎన్‌టీయూ మంథని, మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 16మంది నిపుణులు బోధకులుగా నిర్వహించబడిన ఈ అధ్యాపక శిక్షణా కార్యక్రమంలో 24 మంది పారిశ్రామిక రంగ ప్రతినిధులు, 10 మంది అధ్యాపకులు, 16 మంది పరిశోధన రంగ విద్యార్థులు పాల్గొన్నారని కార్యక్రమ సమన్వయకర్త ఆచార్య వెంకట్రామయ్య తెలియచేశారు. మైనింగ్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డా. శ్రీనివాస్ చేసిన వందన సమర్పణతో సదస్సు ముగిసింది.