కౌన్సిలింగ్ సైకాలజిస్టుల పాత్ర కీలకం

by Shyam |
కౌన్సిలింగ్ సైకాలజిస్టుల పాత్ర కీలకం
X

దిశ, హైదరాబాద్: మానసిక ఆరోగ్య రక్షణలో కౌన్సిలింగ్ సైకాలజిస్టుల పాత్ర అత్యంత కీలకమైందని ప్రముుఖ సైకియాట్రిస్టు హరికుమార్ రవ్వ అన్నారు. ప్రొగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అససోసియేషన్ – ఇండియా జాతీయ సమావేశం అశోక్ నగర్ మైండ్ పర్సనాలిటీ కేర్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ హిప్నో కమలాకర్ అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హరికుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానసిక అనారోగ్యం రాకుండా ఉండేందుకు, వచ్చిన మానసిక సమస్యలు పరిష్కారం అయ్యేందుకు కౌన్సిలింగ్ ప్రక్రియ ఎంతగానో దోహదపడుతోందన్నారు. ఒత్తిడి మూలంగా వచ్చే మానసిక సమస్యలకు ఎలాంటి మందులు లేకుండానే సైకాలజిస్టులు కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరిస్తారని వివరించారు. ప్రేరణాత్మక ఉపన్యాసాలు సైతం మానసిక ఆరోగ్యానికి సత్ఫలితాలు ఇస్తుందని అన్నారు.

ప్రొగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ హిప్నో కమలాకార్ మాట్లాడుతూ.. యూనివర్శిటీలలో పరీక్షల కోసమే సైకాలజీ బోధించడం కారణంగా క్రియాశీల నైపుణ్యాలలో సైకాలజీ పట్ల అవగాహన కొరవడుతోందన్నారు. సమావేశంలో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చొక్కాపు వెంకటరమణ, అసోసియేషన్ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధ్యక్షులు డాక్టర్ వీరభ్రదం, మడమంచు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed