- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహంకాళి ఆలయాభివృద్ధికి రూ.10 కోట్లు ఇవ్వండి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎంఐఎం ఎమ్మెల్యే అక్బురుద్దీన్ ఓవైసీ ఆదివారం సాయంత్రం కలిశారు. గంటపాటు సాగిన సమావేశంలో సీఎం కేసీఆర్ , అక్బరుద్దీన్ ఓవైసీ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని డెవలప్ చేయాలని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కోరారు. లాల్ దర్వాజ బోనాలు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయని గుర్తు చేశారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన దేవాలయానికి కావల్సినంత స్థలం లేకపోవడంతో అభివృద్ధికి నోచుకోవడం లేదని, పండగ సమయంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీఎం దృష్టికి తెచ్చారు. రూ. 10 కోట్లతో టెంపుల్‌ను డెవలప్ చేయాలని వినతి పత్రం సమర్పించారు.
అటు.. పాతబస్తీలోని అప్జల్‌గంజ్ మసీదు మరమ్మతుల కోసం కూడా రూ.3 కోట్ల నిధులు మంజూరు చేయాలని సీఎంను కోరారు. చాలమంది ముస్లింలు నిత్యం ఈ మసీదులో ప్రార్థనలు చేస్తారని, మరమ్మతులకు నోచుకోక పోవడం వల్ల మసీదులో ప్రార్థనలకు ఇబ్బంది కలుగుతుందని వివరించారు. వెంటనే నిధులు మంజూరు చేసి డెవలప్ మెంట్ ప్రక్రియను చేపట్టాలని కోరారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ విన్నపానికి సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్… మహంకాళి, దేవాలయ అభివృద్ధికి, అప్జల్ గంజ్ మసీదు మరమ్మతులకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేష్ కుమార్‌ను ఆదేశించారు