- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నాకు వేరేదారి లేదు.. నన్ను క్షమించు
దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ సమయంలో వలస కూలీల బాధలు వర్ణనాతీతం. ఉన్నదో లేందో తిని.. వందల కిలో మీటర్లు వారు చేసే కాలి నడక ఓ సాహసం. కానీ, నడవలేని తన కొడుకు బాధను చూసిన.. ఆ వలస కూలీ విలవిలలాడిపోయాడు. ఎక్కడో ఒక చోట తలదాచుకుందామంటే కనీస వసతులకే దిక్కులేని పరిస్థితి. గుండెను రాయి చేసుకుని ముందుకెళ్తే తప్ప తాను తన గమ్యానికి చేరడు. తన వరకు పర్లేదే అనుకున్నాడు ఆ తండ్రి.. వికలాంగుడైన తన కొడుకును ఎలా తీసుకెళ్లాలో అర్థం కాలేదు. చేతిలో డబ్బులు లేవన్న వ్యథ అతడిని ఇంకా కలచివేసింది. చివరికి తప్పు, ఒప్పులను పక్కనబెట్టి ఓ నిర్ణయం తీసుకున్నాడు. నన్ను క్షమించండి అంటూ లేఖ రాసి.. ఓ ఇంటివద్దనున్న సైకిల్‌ను అపహరించాడు. అతడు రాసిన ఆ లేఖ వలస కూలీల దుస్థితిని యావత్ దేశానికి చాటిచెప్పింది.
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన వలస కూలీ మహ్మద్ ఇక్బాల్ ఖాన్ బతుకుదెరువు కోసం రాజస్తాన్ బాట పట్టాడు. ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్రంలోని భరత్‌పూర్‌లో నివాసం ఉంటున్నాడు. తనకు వికలాంగుడైన కుమారుడు కూడా ఉన్నాడు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ నిబంధనలు ఆ వలస కూలీకి శాపంగా మారింది. అక్కడ పని దొరక్క.. సరైన తిండిలేక నానా అవస్థలు పడ్డాడు. ఎంత ప్రయత్నించిన తనకు ఇంటికి వెళ్లే మార్గం కనిపించలేదు. కళ్ల ముందు కొడుకు బాధను చూస్తూ ఉండలేకపోయాడు. నడవలేని తన కొడుకును తీసుకెళ్లేందుకు ఓ పథకం వేశాడు. భరత్‌పూర్‌లో ఓ ఇంటిముందు ఉన్న సైకిల్‌ను అపహరించి.. మనస్సు ఒప్పకపోవడంతో తానే సైకిల్ తీసుకెళ్తున్నట్లు లేఖ రాసి పెట్టాడు. ఇందులో మరో ఆసక్తికర విషయమేంటంటే.. తన సైకిల్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన యజమాని ఆ లేఖ చదివి ఫిర్యాదు చేయకుండానే ఇంటికి వచ్చాడు. .