- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రోడ్డుపై వలస కూలీ ప్రసవం..ఆపై 150 కి.మీల నడక
ముంబయి : బతుకు దెరువు కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. ఉన్న ఊళ్లో పని దొరక్క..పొట్ట చేతపట్టుకుని వెళ్లిన వారికి కరోనా వైరస్ శాపంగా మారింది. గత 50 రోజులుగా దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతుండగా ఉపాధి కరువై, తినడానికి తిండిలేక వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వలసొచ్చిన చోటే ఉందామంటే ఇంటి కిరాయిలు, ఇతరత్రా ఖర్చులు అవుతాయి.చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఎలాగైనా సొంతూళ్లకు వెళ్లి బతుకుదామని నిర్ణయించుకున్నారు. వలస కూలీలను తరలించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించినప్పటికీ అవి విడతల వారీగా రైళ్లు, ప్రత్యేక బస్సుల ద్వారా లిమిటెడ్ మెంబర్స్‌ను తరలిస్తున్నాయి. అప్పటి వరకు వేచి చూద్దామంటే ఆకలి చావులు చూడాల్సి వస్తుంది. దీంతో చాలా మంది కూలీలు నడకదారినే రాష్ట్రాలు దాటి తమ సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్దపడ్డారు. దారి పొడుగునా ఎవరైనా దాతలు పెట్టింది తింటూ, చెట్ల కింద సేద తీరుతూ వేల కిలో మీటర్లు నడుస్తున్నారు.ఈ క్రమంలోనే మహారాష్ట్రకు వలసొచ్చిన మధ్యప్రదేశ్‌కు చెందిన దంపతులు గత కొన్ని రోజులుగా కాళ్లనే నమ్ముకుని నాసిక్ నుంచి సత్నాలోని స్వగ్రామానికి ప్రయాణం కట్టారు. మంగళవారం మార్గ మధ్యలో తన భార్యకు పురిటి నొప్పులు రాగా, రోడ్డుపైనే ప్రసవించిందని, డెలీవరీ అయ్యాక 2గంటలు విశ్రాంతి తీసుకుని మళ్లీ 150 కిలోమీటర్లు నడిచినట్టు భర్త వివరించాడు. మధ్యప్రదేశ్ బార్డర్ వద్దకు చేరుకోగానే అక్కడి అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి కోసం ప్రత్యేకంగా ఓ వాహనాన్ని ఏర్పాటు చేసి సత్నాకు తరలించినట్టు సత్నా మెడికల్ బ్లాక్ ఆఫీసర్ ఏకే రాయ్ తెలిపారు.