- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గల్ఫ్ కంట్రీలో ఆగిన మరో గుండె..
దిశ బాల్కొండ: గల్ఫ్ కంట్రీలో పని కోసం వలన వెళ్లిన కార్మికులు ఈ మధ్యకాలంలో వరుస మరణాల బాట పడుతున్నారు.తాజాగా నిజామాబాద్ జిల్లా ముప్కాల్ గ్రామానికి చెందిన దరవాస్తు హరిచరన్ (46) సోమవారం సౌదీలోని రియాద్‌లో గుండెపోటుతో మరణించారు.
ఈయన సంవత్సరం కిందట ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్ళాడు. నిన్న సౌదీలోని రియాద్‌లో గుండె పొటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మృతునికి భార్య వరలక్ష్మితో పాటు ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. అప్పులు బాగా అవ్వడంతో డబ్బుల సంపాదన కోసం వెళ్లిన ఇంటిపెద్ద ఇకలేరని తెలియడంతో దిక్కుతోచని స్థితిలో కుటుంబసభ్యులు ఉన్నారు. అప్పులు తీరకపోగా, తాజా ఘటన వారిని మరింత ఇబ్బందుల పాలు చేసింది. ప్రభుత్వం చొరవ చూపి హరిచరన్ మృతదేహాన్నిస్వస్థలానికి రప్పించాలని బాధిత కుటుంబీకులు కోరుతున్నారు.