- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
OLXలో మిగ్ ఫైటర్ జెట్..
దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ ద్వారా సెకండ్ హ్యాండ్ వస్తువుల విక్రయం ఓఎల్ఎక్స్ వెబ్‌సైట్‌లో జరుగుతుంటాయి. అయితే, ఇండియన్ ఆర్మీకి చెందిన మిగ్ ఫైటర్ జెట్‌ను గుర్తుతెలియని కొందరు వ్యక్తులు OLXలో అమ్మకానికి పెట్టారు. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకే కొందరు ఈలాంటి పనులు కూడా చేస్తుంటారని తెలుస్తోంది. ఈ ఘటన అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీలో జరిగింది. ఆ యూనివర్శిటీలో సందర్శనకు ఉంచిన మిగ్ 23 విమానాన్ని ఓ వ్యక్తి అమ్మకానికి పెట్టాడు.దాని ధర రూ. 9.99 కోట్లుగా నిర్ణయించాడు. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ విషయం అలీగఢ్ విశ్వవిద్యాలయం దృష్టికి వచ్చింది. యూనివర్శిటీ అటువంటి పోస్ట్ చేయలేదని, కావాలనే ఎవరో ఇలా చేసుంటారని వెల్లడించింది. ఓఎల్ఎక్స్‌లో మిగ్ 23 విమానాన్ని అమ్మకానికి పెట్టిన వ్యక్తిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని అలీగఢ్ విశ్వవిద్యాలయం స్పష్టంచేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిగ్ 23 విమానాన్ని 2009లో అలీగఢ్ విశ్వ విద్యాలయానికి బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే.