- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బయో ఏషియా సదస్సుకు సత్యనాదెళ్ల
దిశ, తెలంగాణ బ్యూరో: ఏషియాలోనే అతిపెద్ద లైఫ్‌సైన్సెస్, హెల్త్కేర్ఫోరం బయోఏషియా. దాని 18వ ఎడిషన్ సదస్సులో పాల్గొనేందుకు హెమాహెమీలు రానున్నారు. ప్రముఖ వ్యాపారవేత్తలతో పాటు అనేక మంది టెక్నాలజీ, లైఫ్సైన్సెస్రంగాల నిపుణులు, విధాన రూపకర్తలు హాజరు కానున్నారు. ఈ ఏడాది కోవిడ్–19, దాని ప్రభావంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. ప్రపంచ ఆరోగ్యమే ప్రధానాంశంగా చర్చలు, ప్యానెల్ డిస్కషన్స్ జరుగుతాయి.
ఫిబ్రవరి 22, 23 తేదీల్లో జరిగే బయోఏషియా సదస్సులో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, డీడీపీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ప్రోగ్రామ్స్ డా.సౌమ్యస్వామినాధన్, ఎఫ్డీఏ డైరెక్టర్ డా.పీటర్మార్క్స్, నీతి అయోగ్‌సభ్యుడు డా.వీకే పాల్, సీఈపీఐ సీఈఓ డా.రిచర్డ్హచెట్, గ్లోబల్హెల్త్గేట్స్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ డా.ట్రెవర్ముందెల్ తదితరులు ప్యానెల్ డిస్కషన్స్‌లో పాల్గొంటారు.
‘చర్చ 2021– హెల్త్‌కేర్’ అనే అంశంలో సత్య నాదెళ్లతో పాటు మంత్రి కేటీ రామారావు పాల్గొంటారు. హెల్త్‌కేర్‌లో అవకాశాలు, టెక్నాలజీ వినియోగం, లైఫ్‌సైన్సెస్‌పై మాట్లాడుతారని నిర్వాహకులు పేర్కొన్నారు. రెండు రోజుల పాటు జరిగే అనేక అంశాలపై ప్రపంచ స్థాయి నిపుణులు, పాలసీ మేకర్స్ మాట్లాడుతారు. ఈ మేరకు షెడ్యూల్‌ను విడుదల చేశారు.