బాలు ఆరోగ్యంపై ఎంజీఎం స్పెషల్ బులెటిన్ 

by Shyam |
బాలు ఆరోగ్యంపై ఎంజీఎం స్పెషల్ బులెటిన్ 
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గత నెల రోజులుగా కరోనాతో పోరాడుతున్నారు. కరోనా పాజిటివ్ రావడంతో ఆగస్టు మొదటివారంలో చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో ఐసీయూలోనే వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

మధ్యలో ఓసారి ఆరోగ్యం బాగా క్షీణించినా, క్రమంగా కోలుకుంటూ ఆత్మీయుల్లో ధైర్యం పెంచారు. ఈ నేపథ్యంలో ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు ఎస్పీ బాలు ఆరోగ్యంపై ప్రత్యేక బులెటిన్ విడుదల చేశాయి. ఆయనకు ఇంకా వెంటిలేటర్ పై ఎక్మో సాయంతో చికిత్స కొనసాగుతూనే ఉందని బులెటిన్ లో పేర్కొన్నారు.

ప్రస్తుతం బాలు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఆయన స్పృహలోనే ఉన్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. తమ ఆసుపత్రికి చెందిన భిన్న వైద్య విభాగాల నిపుణులు బాలు ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు.

Advertisement

Next Story