- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జనవరిలో 7-సీటర్ హెక్టార్ ప్లస్ లాంచ్!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ తన హెక్టార్ ప్లస్ 7-సీటర్ వెర్షన్‌ను భారత్‌లో 2021, జనవరి నాటికి లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ ఏడాది జులైలో ఎంజీ మోటార్స్ హెక్టార్ ప్లస్ ఎస్‌యూవీ 6-సీటర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత 6-సీటర్ ఎంజీ హెక్టార్ ప్లస్ రూ. 13.73 లక్షల నుంచి రూ. 18.68 లక్షల మధ్య లభిస్తోంది. 7-సీటర్ హెక్టార్ ప్లస్ ధర ఇంకా నిర్ణయించలేదని కంపెనీ తెలిపింది. హెక్టార్ పల్స్ 7-సీటర్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో రానుందని, పవర్‌ట్రెయిన్ 48వి మైల్డ్ హైబ్రిడ్ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నట్టు కంపెనీ పేర్కొంది.
ప్రస్తుతం 6-సీటర్ ఎస్‌యూవీలో 2+2+2 విధంగా ఆరుగురు కూర్చే విధంగా ఉంది. 7-సీటర్ ఎస్‌యూవీలో మధ్య వరుసలో ముగ్గురు కూర్చునే విధంగా అమర్చనున్నట్టు కంపెనీ వివరించింది. ఈ సిటింగ్ సామర్థ్యాన్ని పెంచడం వల్ల అదనపు లగేజ్ స్పేస్ లభిస్తుందని కంపెనీ తెలిపింది. భారత మార్కెట్లో ఎక్కువ సీటింగ్ సామర్థ్యం కలిగిన వాహనాలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఎంజీ మోటార్స్ ఈ సరికొత్త హెక్టార్ ప్లస్ 7-సీటర్ ఎస్‌యూవీని రూపొందించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఈ వెర్షన్ ప్రస్తుత భారత మార్కెట్లో ఉన్న టాటా గ్రావిటాస్, నెక్స్ట్ జెన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 500, హ్యూండాయ్ క్రెటా మోడళ్లకు పోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
- Tags
- MG
- MG Hector Plus