- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్ డౌన్‌తో మానసిక సమస్యలు..!
దిశ, హైదరాబాద్: కరోనా కరాళ నృత్యానికి ప్రపంచమంతా వణికిపోతోంది. భారత్ కూడా భయపడుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ (కోవిడ్ -19) కట్టడికి ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలన్నీ చాలా మేరకు మూతపడ్డాయి. ఫలితంగా దైనందిన జీవన విధానంలో నిరంతరం ఉరుకులు పరుగులు పెట్టే మనుషులు ఒక్కసారిగా ఇండ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. శాస్త్ర, సాంకేతిక రంగం బాగా అభివృద్ధి చెందిన ఈ కాలంలో ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకూ భార్యా, పిల్లలతో కాస్తా హాయిగా గడిపే టైం కూడా కుదరనంత బిజీగా ఏదో ఒక పనిలో ప్రతి ఒక్కరూ నిమగ్నమయ్యే సంగతి తెల్సిందే. ఈ పరిస్థితిలో కరోనా వైరస్ కారణంగా యావత్తు ప్రజానీకం ఒక్కసారిగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లింది.
ప్రిపరేషన్ అవసరం..
నిత్యం ఉద్యోగంలో బిజీగా ఉండే ప్రజానీకం చేసే పనిలో మెళుకువలు ప్రదర్శించినట్టుగానే ఇంట్లో ఖాళీగా కూర్చోవాలన్నా.. అందుకు తగిన జాగ్రత్తలు, మెళుకువలు తీసుకోవాలా? ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా స్వీయ నిర్బంధంలోకి వెళ్తే కచ్చితంగా మానసిక సమస్యలు వస్తాయా? అంటే..అవుననే అంటున్నారు మానసిక నిపుణులు. ప్రస్తుతం అందర్నీ కరోనా ఫోబియా వెంటాడుతోంది. ఎలాంటి చికిత్స లేనందున ప్రజలు మరింత అపోహాలకు గురవుతున్నారు. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు పదే పదే చేతులు కడుక్కోవడం కారణంగా ఓసీడీ డిజార్డర్ రావడానికి అవకాశం ఉంది. దీంతో మనలో అసంతృప్తి, అసహనం పెరుగుతాయి. ముఖ్యంగా ఆల్కహాల్ తీసేుకునే అలవాటు ఉన్నవారికి 48 గంటల్లో వణుకు పుట్టడం, ఫిట్స్ రావడంతో పాటు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం వంటి లక్షణాలు వస్తాయంటున్నారు మానసిక నిపుణులు. ప్రస్తుతం విద్యా సంస్థలు కూడా మూతపడటంతో ఇంట్లో పిల్లలు, పెద్దలు ఒకే సమయంలో, ఒకేచోట ఉంటున్నందున ఈగో సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది. ఫలితంగా కుటుంబ సభ్యుల మధ్య చిన్న సమస్యలు పెద్ద వివాదాలుగా మారే అవకాశముంది. భార్యాభర్తల మధ్య గొడవలు పెరగనున్నాయి. సాధారణంగా మహిళలే ఇంటి పని ఎక్కువ చేస్తారు. దీంతో లాక్ డౌన్ పురుషులకు మాత్రమే అనే భావన లేకుండా.. ఇంటి పనిలోనూ పురుషులు సహకరించాలి. భార్యా పోరు పడలేకపోతున్నట్టు ఓ పౌరుడు ఇటీవల మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేసిన విషయం తాజాగా సోషల్ మీడియాలో హాల్ చల్ అవుతోంది. అయితే, వ్యక్తుల్లో ఈ తరహా ఒత్తిడి పెరగడం వల్ల మనలో ఆలోచనా స్థాయి, విశ్లేషణా శక్తి తగ్గిపోయే వీలుంటుందని మానసిక నిపుణులు అంటున్నారు.
మానసిక నిపుణుల సలహాలు..
స్వేచ్ఛగా ఆలోచించడం, కలలు కనడం పిల్లలకు ఉండే గొప్ప లక్షణం. తల్లిదండ్రులు ఈ కలలకు రెక్కలు తొడిగితే, వారిదే విజయం. పిల్లలను ఇతరులతో పోల్చడం, విమర్శించడం, కామెంట్ చేయడం లాంటివి తల్లిదండ్రులు మానుకోవాలి. ఇంటికి మించిన ప్రశాంతమైన వాతావరణం మరెక్కడా దొరకదనే భావన పిల్లల్లో కలిగించాలి. కుటుంబ సభ్యులతో చక్కని అనుబంధం ఉండేలా చూసుకోవాలి. కలిసి భోజనం చేయాలి. మైండ్ హ్యాకింగ్‌లో విజయం సాధించాలంటే.. పాజిటివ్ ఆలోచనలు చేయాలి. వైవిధ్యభరితమైన జ్ఞాపక క్రీడలు ఆడాలి. దీంతో పాటు వైకుంఠ పాళి, చెస్, క్యారమ్స్ తదితర ఆటలు ఆడుకోవాలి. మెదడులోకి ఏది తీసుకోవాలో.. ఏది తీసుకోకూడదో అనే విషయాలపై ఈ ఆటలు దోహదపడతాయి. మనసును నియంత్రణ చేసుకోవడానికి వ్యాయామం, యోగా, ధ్యానం మంచి మార్గాలు.
ఉచిత ఫోన్ కౌన్సెలింగ్ కోసం..
ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో కుటుంబ సభ్యుల మధ్య ఈ తరహా వివాదాలు వచ్చే వీలుంటుందని మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ నిర్వాకులు ప్రముఖ స్టేజీ హిప్నాటిస్ట్, కౌన్సిలింగ్ సైకాలిజిస్టులు డాక్టర్ హిప్నో కమలాకర్, డాక్టర్ హిప్నోపద్మాకమలాకర్ దంపతులు చెబుతున్నారు. అయితే, ఈ తరహా సమస్యలకు ఫోన్ ద్వారా ఉచిత కౌన్సెలింగ్ ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. అందుకు 93900 44031, 93900 44080 నెంబర్లలో సంప్రదించాలన్నారు.
Tags : mental pressure, lock down, coronavirus (covid-19), effect