- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్‌రెడ్డిని కలిసిన రియల్టర్ అసోసియేషన్ సభ్యులు
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డిని ఆదివారం తెలంగాణ రియల్టర్ల అసోయేషన్ సభ్యులు కలిశారు. ప్రజలపై అన్యాయంగా మోపిన ఎల్ఆర్ఎస్ భారాన్ని రద్దు చేసేందుకు తాము చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ కుమార్ గౌడ్ నేతృత్వంలోని బృందం రేవంత్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆరేళ్ల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా వేల గ్రామ పంచాయితీల్లో లేఅవుట్లు వేశారన, వీటికి ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని, రిజిస్ట్రేషన్లు కూడా చేసిందన్నారు. ఒక్కో ప్లాటు ఇప్పుడు పలువురి చేతులు మారిందని, అదే ప్రభుత్వం ఆ ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్లు చేస్తామనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇన్నాళ్లుగా లేని తెలివి ఇప్పుడెందుకు ప్రదర్శిస్తున్నారని అడిగారు. ఎల్ఆర్‌ఎస్ రద్దు చేయకుంటే రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఓట్లే వేయమని ప్రైవేటు ఉద్యోగులు, విద్యావంతులు చెబుతున్నారన్నారు. 29న జరిగే హైవేల దిగ్బంధన కార్యక్రమంలో తాను పాల్గొంటానని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు చెప్పారు.