సోనూ భాయ్.. నువ్వే దిక్కు : మెహర్ రమేష్

by Shyam |
సోనూ భాయ్.. నువ్వే దిక్కు : మెహర్ రమేష్
X

దిశ, సినిమా : కరోనా కారణంగా గతేడాది లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి తన సాయం కోరిన ప్రతీ ఒక్కరికి సోనూసూద్ హెల్ప్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెకండ్ వేవ్ విపత్కర పరిస్థితుల్లోనూ తన ఫౌండేషన్ తరఫున అవిశ్రాంతంగా సేవలందిస్తున్నాడు. ఈ మేరకు అవసరమైన వారికి ఆక్సిజన్ సిలిండర్లు, ఇతరత్రా వైద్య సదుపాయాలను క్షణాల్లో సమకూరుస్తున్నాడు. ఈ మేరకు క్రిటికల్ సిచ్యువేషన్స్‌ తలెత్తితే సెలబ్రిటీలు సైతం హెల్ప్ కోసం తననే ఆశ్రయిస్తున్నారంటే సోను అండ్ టీమ్‌ కమిట్‌మెంట్‌ను అర్థం చేసుకోవచ్చు.

ఈ మేరకు క్రికెటర్ సురేష్ రైనాకు కూడా సోను సాయపడ్డాడు. కాగా, తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ కూడా ఎమర్జెన్సీ మెడిసిన్ కోసం ట్విట్టర్ వేదికగా సోను సూద్‌ను రిక్వెస్ట్ చేశాడు. ‘డియర్ సోనూసూద్ భాయ్.. హైదరాబాద్‌లో పొడుగు వెంకట రమణ అనే కరోనా పేషెంట్ కోసం Tocilizumb 400 mg & 1 tab Baricitinib 4mg, 3 రెమిడిసివర్ ఇంజెక్షన్లు అర్జెంటుగా కావాలి. నా స్థాయిలో నేను ప్రయత్నించినా ఎక్కడా దొరకలేదు. ఇప్పుడు మీరు, మీ ఫౌండేషన్ తప్ప వేరే ఆశ లేదు. ఎలాగైనా ఈ సాయం చేయండి’ అని పోస్టు చేశాడు.

https://twitter.com/MeherRamesh/status/1390709105682124800?s=20

Advertisement

Next Story

Most Viewed