‘గుర్తుందా శీతాకాలం’ అంటున్న మేఘ..

by Shyam |
‘గుర్తుందా శీతాకాలం’ అంటున్న మేఘ..
X

దిశ, వెబ్‌డెస్క్ :
సూపర్ క్యూట్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ మేఘా ఆకాశ్ టాలీవుడ్‌లో మరో చాన్స్ కొట్టేసింది. మేఘా సుబ్రహ్మణ్యం అంటూ ‘లై’ సినిమాలో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ ప్రెట్టీ గర్ల్.. మరోసారి తన ప్రెట్టీ లుక్స్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకోనుంది. సత్యదేవ్ హీరోగా వస్తున్న ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాలో స్పెషల్ రోల్ చేయబోతుంది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అఫిషియల్‌గా ప్రకటించగా, ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు ఫ్యాన్స్. అయితే ‘చల్ మోహనరంగ, లై’ సినిమాలతో ఆకట్టుకున్నా సరైన హిట్ అందుకోలేని మేఘ.. కనీసం ఈ సినిమాతో అయినా హిట్ అందుకోవాలని ఆశిస్తున్నారు అభిమానులు.

‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాతో హిట్ అందుకున్న సత్యదేవ్.. కన్నడ మూవీ ‘లవ్ మాక్ టైల్‌’ను గుర్తుందా శీతాకాలం టైటిల్‌తో రీమేక్ చేస్తున్నాడు. నాగశేఖర్ దర్శకత్వం వహిస్తూ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా సత్యదేవ్ సరసన నటిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed