చిరంజీవి సీరియస్ వార్నింగ్ : అల్లర్లతో ‘మా’ పరువు తీయొద్దు

by Anukaran |   ( Updated:2021-10-10 11:15:54.0  )
చిరంజీవి సీరియస్ వార్నింగ్ : అల్లర్లతో ‘మా’ పరువు తీయొద్దు
X

దిశ, వెబ్‌డెస్క్ : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. పెళ్లి సందడి ప్రీ రిలీజ్ ఇవెంట్‌లో భాగంగా చిరంజీవి మాట్లాడారు. అల్లర్లతో ‘మా’ పరువు తీయొద్దని సీరియస్‌గా చెప్పారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని సూచించారు.వివాదాలతో చులకన కావొద్దన్నారు. పదవులు తాత్కాలికం అని, ఆధిపత్యం చూపించుకునేందుకు అవతల వారిని కించపరచొద్దన్నారు.

ఎవరి మూలంగా ఈ వివాదాలు ప్రారంభమయ్యాయి. మూలాల్లోకి వెళ్లి అందరూ ఆలోచించాలన్నారు. గొడవలకు కారణమయ్యే వ్యక్తులను దూరం పెట్టాలని మా సభ్యులకు చిరంజీవి సూచించారు. ఇదిలాఉండగా, మా పోలింగ్ సందర్భంగా మాజీ అధ్యక్షుడు నరేష్, ప్రకాశ్ రాజ్ మధ్య గొడవ తలెత్తిన విషయం తెలిసిందే. ఒకానొక సందర్భంలో నువ్వెంత అంటే నువ్వెంత అనే వరకు వెళ్లింది. ఈ విషయం సినీ పెద్దలకు చేరువ కావడంతో చిరు ఈ విధంగా స్పందించినట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story