- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘చిరంజీవి అన్నయ్యా… మీరు సంతోషంగా ఉండాలి’
దిశ, వెబ్‌డెస్క్: రక్తహీనతతో బాధపడుతున్న వారిని చూసి చలించిన మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో బ్లడ్ బ్యాంక్‌లకు శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా కరోనా కరాళనృత్యం చేస్తుంటే ఆక్సిజన్ అందక ప్రజలు ప్రాణాలు కొల్పోతుంటే ఇప్పడు ప్రతి జిల్లాకు ఆక్సిజన్ బ్యాంకులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. అలాంటి చిరంజీవి తన సహనటుడు ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న విషయం తెలుసుకొని ఆర్థిక సహాయం చేశారు. పలు చిత్రాల్లో ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన పొన్నాంబళం గత కొద్దిరోజుల నుండి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఆపరేషన్ చేయించుకోవాడానికి పొన్నాంబళం ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో, ఈ విషయం చిరుకు తెలియడంతో రూ. 2లక్షలు ఆన్‌లైన్ ద్వారా బదిలీ చేశారు.
చిరంజీవికి సహాయానికి సంతోషంతో పొన్నంబళం ఓ వీడియో విడుదల చేశారు. ‘చిరంజీవి అన్నయ్య.. మీ పేరులోనే అంజనేయుడు ఉన్నాడు. ఆ స్వామి మిమల్ని చిరంజీవిగా ఉంచాలని కోరుకుంటున్నా.. మీరు పంపిన డబ్బు నాకు చాలా ఉపయోగపడింది… ధన్యవాదాలు అన్నయ్య… జై శ్రీరామ్’ అంటూ కృతజ్ఞతలు తెలిపారు.