- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెగా డాటర్ డ్రెస్‌పై నెట్టింట్లో రచ్చ
స్టార్ హీరో ఫ్యామిలీ నుంచి హీరోలు రావడం కామన్. కానీ, హీరోయిన్లు చాలా అరుదు. అలాంటిది చాలా ఆటంకాలు దాటుకుని టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక. ఆమె సినీరంగ ప్రవేశం చేస్తుందంటే మెగా ఫ్యాన్స్ ఒప్పుకోలేదు. తన కూతురు తెరపై వల్గర్‌గా నటించదని నాగబాబు బుజ్జగించడంతో నిహారిక సినిమాల్లోకి వచ్చింది. తెలుగులో ‘ఒక మనసు’ అనే సినిమా చేసిన నిహారిక సక్సెస్ అందుకోలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్, ఒరు నళ్ల నాల్ పాతు సొల్రెన్, సైరా చిత్రాలూ ఆమెకు నిరాశనే మిగిల్చాయి. దీంతో సినిమాలకు దూరంగా ఉంటున్న నిహారిక, వెబ్ సిరీస్‌లపై దృష్టి సారించింది. మొదట ముద్దపప్పు ఆవకాయ్ అనే వెబ్ సిరీస్ ద్వారా సక్సెస్ అందుకున్న నిహారిక.. ప్రస్తుతం మ్యాడ్ హౌస్ అనే వెబ్ సిరీస్ చేస్తోంది.
ఇక్కడి వరకు బాగానే ఉన్నా సోషల్ మీడియాలో ఎప్పుడూ అభిమానులతో టచ్‌లో ఉండే నిహారిక ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచేసింది. క్లీవేజ్ షో చేస్తూ హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చావు, ఇలాంటి పొట్టి బట్టలు వేసుకుంటావా అంటూ విమర్శిస్తున్నారు. గ్లామర్ లుక్ కోసం ట్రై చేస్తున్నావా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, మెగా ఫ్యాన్స్ మాత్రం నిహారికకు అండగా నిలుస్తున్నారు. చాలా మంది అమ్మాయిలు అలాగే వేసుకుంటున్నారు, నిహారిక వేసుకుంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. మెగా డాటర్ డ్రెస్‌పై రెండు వర్గాలు నెట్టింట్లో రచ్చ చేస్తున్నాయి.