‘హ్యాపీ బర్త్ డే మావయ్యా’.. పవన్ కల్యాణ్‌కు మెగా కోడలు విషెస్

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-02 15:48:33.0  )
‘హ్యాపీ బర్త్ డే మావయ్యా’.. పవన్ కల్యాణ్‌కు మెగా కోడలు విషెస్
X

దిశ, వెబ్‌డెస్క్: సెప్టెంబర్ 2nd ఇది పవన్ కల్యాణ్ అభిమానులకు చాలా ప్రత్యేకమైన రోజు. ప్రతీ సంవత్సరం ఆయన పుట్టినరోజును ఘనంగా నిర్వహిస్తారు. ఏదో ఒక సినిమా రీరిలీజ్ చేసి థియేటర్ల వద్ద జాతర వాతావరణం క్రియేట్ చేస్తారు. అంతేకాదు.. సోషల్ మీడియాను ఓ కుదుపు కుదిపేస్తారు. ఒకవైపు పోస్టులు, మరోవైపు వీడియోలతో మోత మోగిస్తారు. తాజాగా ఇవాళ ఆయన పుట్టినరోజు కావడంతో గబ్బర్ సింగ్ సినిమా రీరిలీజ్ చేసి గత రికార్డులన్నీ బద్దలు కొట్టినట్లు మేకర్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. పవన్ కల్యాణ్‌కు విష్ చేస్తూ ప్రముఖ నటి, వరుణ తేజ్ సతీమణి లావణ్య త్రిపాఠి ఆసక్తికర పోస్టు పెట్టింది. పవన్ కల్యాణ్ ఫొటో పెట్టి ‘‘హ్యాపీ బర్త్ డే మావయ్యా. మీరు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని.. ఇలాగే అందరికీ ఇన్‌స్పైర్ చేయాలని’’ కోరుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది.



Advertisement

Next Story

Most Viewed