- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీకే వ్యూహాలు.. త్వరలో థర్డ్ ఫ్రంట్?
న్యూఢిల్లీ: కేంద్రంలో కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వాన్ని ఢీకొట్టడానికి ప్రతిపక్షాలు సంయుక్తంగా పోరాడటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీపై కలిసి పోటీ చేయడానికి ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకతాటి మీదకు తీసుకురావడానికి ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రతిపక్ష పార్టీలతో థర్డ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసే ఆలోచనలు చేస్తున్నట్టు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ప్రముఖ పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్‌తో ఆయన మరోసారి భేటీ కావడం ఈ వాదనలను బలపరుస్తున్నాయి. ఈ నెల 11న కనీసం మూడు గంటలపాటు శరద్ పవార్ నివాసంలో వారు భేటీ అయ్యారు. తాజాగా, సోమవారం గంటన్నరపాటు చర్చలు జరిపారు. ఈ సమావేశానంతరం శరద్ పవార్ కనీసం 15 పార్టీలకు ఆహ్వానం పంపినట్టు తెలిసింది. మంగళవారం సాయంత్రం వీరందరితో భేటీ కావడానికి నిర్ణయించినట్టు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. కేంద్ర మాజీ మంత్రి, టీఎంసీ నేత యశ్వంత్ సిన్హా, ఆర్‌జేడీ నేత మనోజ్ ఝా, ఆప్ నేత సంజయ్ సింగ్‌లు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నట్టు వివరించాయి. ‘మిషన్ 2024’పై డిస్కషన్ వేడివేడిగా సాగనున్నట్టు పేర్కొన్నాయి. అయితే, ఈ వ్యూహ ప్రతివ్యూహాలు కేవలం 2024 ఎన్నికల కోసమే కాదనీ, త్వరలో జరగనున్న యూపీ సహా ఇతర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రతిపక్షాలు ఆచరించే ప్రణాళికపైనా ఫోకస్ ఉండనున్నట్టు చెప్పాయి.
పలురాష్ట్రాల్లో కాంగ్రెస్సేతర ప్రతిపక్ష పార్టీలు అధికారాన్ని అలంకరించడం, వారి పట్టుపెరగడంతో ‘మిషన్ 2024’కు మార్గం సుగమం అయినట్టు తెలుస్తున్నది. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, కేరళలో పినరయి విజయన్‌లు మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవడం, తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం విపక్ష పార్టీల్లో కొత్త ఉత్తేజాన్ని తీసుకువచ్చాయి. వీటితోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్‌లలోనూ కాంగ్రెస్సేతర ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నాయి. బిహార్‌లో తేజస్వీ గతంలో కంటే బలాన్ని పెంచుకున్నారు. ఈ సందర్భంలోనే శరద్ పవార్, ప్రశాంత్ కిశోర్‌తో భేటీలో జాతీయస్థాయి వ్యూహాలపై చర్చలు జరిగినట్టు కథనాలు వచ్చాయి. కాంగ్రెస్‌లోనూ కదలికలు కనిపిస్తున్నాయి. ఈ నెల 24న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ జనరల్ సెక్రటరీలు, రాష్ట్ర ఇంచార్జీలు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులతో ఆన్‌లైన్‌లో సమావేశమవనున్నారు