కార్ మోడల్ క్యాట్.. సంపాదనలో భేష్

by Shyam |
కార్ మోడల్ క్యాట్.. సంపాదనలో భేష్
X

దిశ, ఫీచర్స్ : చైనాలోని చాంగ్‌కింగ్‌కు చెందిన బ్రిటిష్ షార్ట్‌హెయిర్ జాతి పిల్లి ‘మావో మావో’. ప్రొఫెషనల్ క్యాట్ మోడల్‌గా రాణిస్తున్న ఈ పిల్లి మనుషుల కంటే ఎక్కువగా సంపాదిస్తోంది. ఈ క్రమంలో ప్రతి ప్రదర్శనకు 5,000 యువాన్ (775 డాలర్లు) నుంచి 10,000 యువాన్ (1,550 డాలర్లు) వరకు చార్జ్ చేస్తోంది.

సాధారణంగా మోడలింగ్ ఫీల్డ్‌లో ఫేమ్ వస్తే.. డబ్బు సంపాదించడం సహజమే. కానీ ఫేమ్ వస్తుందని ఖచ్చితంగా చెప్పలేం. జంతువుల విషయంలోనూ అంతే కాగా.. శునకాలు, పిల్లులు ఇతర జంతువులు కూడా మోడలింగ్ ద్వారా అధిక మొత్తాలు ఆర్జించిన సందర్భాలున్నాయి. ఈ ‘మావో మావో’ కూడా ఆ జాబితాకు చెందిందే. ఆటోమోటివ్ పరిశ్రమలో పనిచేసే ఈ పిల్లి యజమాని.. ఓ సారి తమ కంపెనీలో జరిగిన ఆటో షోలో అందరి దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతో, తన పెంపుడు పిల్లిని కారుపై కూర్చోబెట్టాడు. ఆ ఆలోచన సూపర్‌గా వర్కవుట్ అయింది. అక్కడికి వచ్చిన వారందరి చూపులు ఆ అందమైన పిల్లిపైనే పడ్డాయి. ఈ క్రమంలో ఫొటోలు క్లిక్ చేసి, తమ సోషల్ మీడియా షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. దీన్ని అవకాశంగా తీసుకున్న ‘మావో మావో’ యజమాని.. కార్ బ్రాండ్‌ల ఎక్స్‌పోజర్ కోసం తన పిల్లిని కార్ మోడల్‌గా ప్రోత్సహించడం ప్రారంభించాడు. అంతే.. షార్ట్ పీరియడ్‌లోనే ‘మావో మావో’ ఆటో షోస్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవడం మొదలైంది.

అయితే ఈ సక్సెస్‌లో దాని యజమాని పాత్ర ఎనలేనిది. ఫ్యాషనబుల్ డ్రెస్‌లలు వేసి, అందంగా తయారుచేయడం వల్లే ఆ పిల్లికి డిమాండ్ పెరిగిపోయింది. కాగా, ప్రస్తతుం ‘మావో మావో’ తన ప్రతీ ప్రదర్శనకు 5,000-10,000 యువాన్లు సంపాదిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed