9 అడుగుల పొడవైన జుట్టుతో రికార్డ్ బ్రేక్ చేసిన ముంబై గర్ల్

by Harish |   ( Updated:2021-10-08 04:34:55.0  )
Akanksha Yadav
X

దిశ, ఫీచర్స్: మీడియం లేదా షార్ట్-లెంగ్త్ హెయిర్‌ను మెయింటెయిన్ చేయడానికే చాలామంది యువతులు ఎన్నో కష్టాలు పడుతుంటారు. కానీ, ఆకాంక్ష యాదవ్ మాత్రం తన 9 అడుగుల 10.5 అంగుళాలు (3.01 మీ) పొడవాటి జుట్టును ఈజీగా హ్యాండిల్ చేస్తోంది. అది ఆమెకు గొప్ప వరమని ఇతర మహిళలు అనుకోవడం అతిశయోక్తేం కాదు. భారతదేశంలో పొడవైన జుట్టు కలిగి ఉన్న వ్యక్తిగా ఆకాంక్ష యాదవ్ రికార్డ్ మూడేళ్లుగా ఎవరూ బ్రేక్ చేయకపోవడం విశేషం.

చాలామంది యువతులు ఆరోగ్యమైన, పొడవాటి కురులను కోరుకుంటారు. కానీ, అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు. అయితే ముంబైకి చెందిన ఆకాంక్ష యాదవ్‌కు మాత్రం తన జుట్టే తనకు గుర్తింపు తీసుకొచ్చింది. 2020-2022 లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోగా, భారతదేశంలోనే పొడవైన జుట్టున్న యువతిగానూ ఆమె రికార్డ్ పదిలంగా ఉంది. ‘జాతీయ టైటిల్ గెలవడం చాలా సంతోషాన్నిచ్చింది. రికార్డులు రావడం వల్ల మరింత ఉత్సాహం వస్తోంది. జుట్టు పెంచేందుకు ప్రత్యేకంగా ఎలాంటి సీక్రెట్స్ లేవు. కానీ, ప్రతిరోజూ హెయిర్ వాష్, హెయిర్ టాస్క్ కోసం 20 నిమిషాలు వెచ్చిస్తాను’ అని ఆకాంక్ష తెలిపింది.

Advertisement

Next Story