- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీళ్లెలా బతుకుతున్నారు !
దిశ, ఏపీ బ్యూరో : ఏలూరులో అంతుచిక్కని వ్యాధికి కారణాలు బయటపడుతున్నాయి. సేకరించిన తాగు నీటి నమూనాల్లో సీసం, నికెల్తోపాటు క్రిమి సంహారక అవశేషాలు కొన్ని వేల రెట్లు ఉన్నట్లు గుర్తించారు. వీటిని పరిశీలిస్తున్న వైద్య బృందాలు సైతం నోరెళ్లబెడుతున్నాయి. ఇంతటి భారీ కలుషిత నీటితో ఇక్కడ జనం ఎలా బతుకుతున్నారని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పొలాలు, అక్వా చెరువుల్లో విచ్చలవిడిగా వినియోగించే పురుగుమందులే కారణం కావొచ్చని భావిస్తున్నారు. ఈ దిశగా కారణాలను విశ్లేషిస్తూ ఎయిమ్స్, డబ్లూహెచ్‌వో, సీసీఎంబీ వైద్య బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ముందుగా రోగుల శరీరాల నుంచి సేకరించిన శాంపిల్స్ పరీక్షించినప్పుడు వాటిలో సీసం, నికెల్ ఉన్నట్లు గుర్తించారు. ఇప్పుడు నీటి నమూనాలను పరీక్షిస్తే మరిన్ని విభ్రాంతికర వాస్తవాలు బయటికొచ్చాయి.
నదుల్లోనూ క్రిమిసంహారకాల ప్రవాహం
ఏలూరుకు కృష్ణా, గోదావరి నదుల నుంచి నీళ్లు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాలకు కృష్ణా కాలువ నీరు, మరికొన్ని ప్రాంతాలకు గోదావరి నీళ్లను తాగునీటిగా మార్చి అందిస్తున్నారు. ఈ రెండు నదుల నీళ్ల నుంచి సేకరించిన శాంపిల్స్‌లోనూ క్రిమిసంహారకాలు వేల రెట్లు అధికంగా ఉన్నట్లు తేలింది. వీటిలో కలుపుమొక్కల నివారణకు వాడే మందులతో పాటు దోమలు, ఈగలు, బొద్దింకల నివారణకు వాడేవి, పంటల్లో చీడపీడల నివారణకు వాడే అలాక్లోర్, ఓపీ-డీడీటీ, పీపీ-డీడీఈ వంటి ప్రమాదకర రసాయనాలున్నట్లు తేలింది.
17 వేల రెట్లు అధికంగా రసాయనాలు..
ఏలూరు కృష్ణా కాలువ నుంచి సేకరించిన నీటి నమూనాల్లో మెథాక్లీక్లోర్ ఏకంగా 17,640 రెట్లు ఎక్కువగా ఉందని నిపుణులు తేల్చారు. తాగునీటిలో ఈ రసాయనం అసలు ఉండకూడదు. ఒకవేళ ఉన్నా కేవలం 0.001 మిల్లీ గ్రాములకు మించకూడదు. నమూనా పరీక్షల్లో ఇది 17.64 మిల్లీ గ్రాములున్నట్లు తేలడం డాక్టర్లను సైతం కలవరపెడుతోంది. ఏలూరులోని దాదాపు ఆరు ప్రాంతాల్లో నీటి నమూనాలను పరీక్షించగా అన్ని చోట్లా దాదాపు ఒకే ఫలితాలు రావడంతో జనాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొన్నేళ్లుగా నగరానికి సరఫరా అవుతున్న కృష్ణా, గోదావరి జలాలు విషతుల్యం కావడం వల్లే రోగుల శరీరాల్లో సీసం, నికెల్ చేరినట్లు తెలుస్తోంది. నీళ్లు ఎంత కలుషితమైనా ఇంత పెద్ద ఎత్తున హానికర రసాయనాలు ఉండే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు. బాధితులనే కాకుండా మిగతా ప్రజలనూ పరీక్షించాల్సిన అవసరమున్నట్లు గుర్తించారు.