నిర్మల్‌లో వైద్యారోగ్య సిబ్బంది ఆందోళన

by Aamani |   ( Updated:2020-04-04 01:03:48.0  )
నిర్మల్‌లో వైద్యారోగ్య సిబ్బంది ఆందోళన
X

దిశ, ఆదిలాబాద్:

నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట శనివారం వైద్యారోగ్య సిబ్బంది ధర్నాకు దిగారు. కనీసం మాస్కులు ఇవ్వకుండానే కరోనా వైరస్ అనుమానితుల కోసం ఇంటింటికీ వెళ్లి సర్వే చేయమంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఇంటింటికీ వెళ్లి సర్వే చేయాలని అధికారులు నిర్ణయించారు. శుక్రవారం నుంచి ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, పర్యవేక్షణ సిబ్బంది నిర్మల్ జిల్లాలో సర్వే చేపట్టారు. అయితే, వారికి మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు ఇవ్వలేదు. దీంతో సిబ్బంది కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. సర్వే క్రమంలో ఒక వర్గానికి చెందిన ప్రజలు దూషించడంతోపాటు బెదిరిస్తున్నారని తమకు పోలీసు రక్షణ కల్పించామని సిబ్బంది డిమాండ్ చేశారు. స్పందించిన కలెక్టర్ ముషారఫ్ అలీ ఆరోగ్య సిబ్బంది ప్రతినిధులతో మాట్లాడారు. అవసరమైన భద్రతా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Tags: Medical staff, adilabad, protect, Collectorate, mask, SaniTizers

Advertisement

Next Story

Most Viewed