- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బస్తీ దవాఖానలకు సుస్తీ..!
దిశ, శేరిలింగంపల్లి: రోగమొస్తే పెద్దాస్పత్రులకు వెళ్లలేని పేదల కోసం సర్కార్ బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసింది. కానీ, ఏర్పాటుపై ఉన్న శ్రద్ధ మౌలిక వసతుల కల్పన, వైద్యుల నియామకంపై పెట్టలేదు. దీంతో శేరిలింగంపల్లి నియోజవర్గంలో 14 బస్తీ దవాఖానల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఆస్పత్రుల్లోనూ వైద్యుల జాడలేదు. ఒకరిద్దరు నర్సులతోనే నిర్వహిస్తున్నారు. కనీసం మందులు సైతం అందుబాటులో లేవు. బస్తీ దవాఖానల ఏర్పాటులో సర్కారు ఆరంభశూరత్వమే కనిపిస్తోందని పలువురు బాహాటంగా విమర్శిస్తున్నారు.
పేరుకే బస్తీ దవాఖానలు కానీ వైద్య సేవల్లో మాత్రం పూర్. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మొత్తం 14 చోట్ల బస్తీ దవాఖానాలను సర్కార్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వం బస్తీ దవాఖానల్లో 135 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని, అక్కడే ఫలితాల వెల్లడించేలా ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించింది. ఒక్కో కేంద్రంలో 145 రకాల ఔషధాలు అందుబాటులో ఉంచనునట్లు వెల్లడించింది. 53 రకాల పాథాలజీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ వంటి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపింది. ప్రతీ సోమ, శనివారాల్లో గర్భిణులకు వై ద్య సేవలు, ప్రతీ నెల రెండో సోమవారం ఇమ్యునైజేషన్ చేస్తామని తెలిపింది. నెబ్యులైజర్ సేవలు, ఎల్డర్లీ క్లీనిక్, డ యాబెటిక్, హైపర్ టెన్షన్ బాధితుల కు ఆహార సూ చనలు, ఉచితంగా మం దులు ఇస్తామని సర్కార్ పేర్కొంది. టెలీమెడిసిన్ సేవలు కూడా అందుబాటులోకి ఉంచనున్నట్లు ప్రకటించింది.
డాక్టర్లు లేరు.. వైద్యం అందదు..
బస్తీ దవాఖానాలు కేవలం ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయాయి. కొన్ని దవాఖానలు కమ్యూనిటీ హాళ్లలోనే నిర్వహిస్తుండగా, మరికొన్ని ప్రైవేట్ బిల్డింగ్‌ల్లో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. గచ్చిబౌలిలోని బస్తీ దవాఖానలో సిబ్బంది కొరతతో పాటు కనీస వసతులు లేవు. హైదర్‌నగర్ బస్తీ దవాఖానను కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేశా రు. అక్కడ డాక్టర్ అందుబాటులో ఉండరని స్థానికులు చెబుతున్నారు. మిగతా దవాఖానల్లోనూ ఇదే పరిస్థితులు ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మందుల కొరత..
బస్తీ దవాఖానల్లో మందుల కొర త తీవ్రంగా ఉందని స్వయంగా సిబ్బందే చెబుతున్నారు.ప్రతీదానికి దగ్గరల్లో ఉన్న హెల్త్ సెంటర్‌కు వెళ్లాలని సిబ్బంది సూచిస్తున్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు.
బస్తీ దవాఖానలు ఇవే..
మియాపూర్ డివిజన్ :హెచ్ఏం టీ హిల్స్, నడిగడ్డ తండా
చందానగర్ డివిజన్: వేముకుంట, ఇందిరానగర్
హఫీజ్ పేట్ డివిజన్: గంగారం
కొండాపూర్ డివిజన్: ప్రేమ్ నగర్, కొత్తగూడ
శేరిలింగంపల్లి డివిజన్ : పాపిరెడ్డి నగర్, నెహ్రూ నగర్
గచ్చిబౌలి డివిజన్: గోపన్ పల్లి తండా, భద్రానగర్, గౌలిదొడ్డి, రాయదుర్గం, హైదర్ నగర్
ఆల్విన్ కాలనీ డివిజన్: ఎల్లమ్మబండ, పాపిరెడ్డినగర్, ఆస్ బెస్టాస్ కాలనీ