పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు

by Shyam |
పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు
X

దిశ, మహబూబ్‌నగర్: కరోనా మహమ్మారిని నివారించేందుకు నిర్విరామంగా పని చేస్తున్న జిల్లా పోలీసు సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించాలని జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరి వైద్యాధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని నవోదయ, సుశ్రుత, నేహా సన్‌షైన్ ఆసుపత్రుల్లో పోలీస్ సిబ్బందికి జరుగుతున్న వైద్య పరీక్షల వివరాలను ఆదనపు ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పని చేస్తున్న సిబ్బంది సంక్షేమం కోసం ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. మే ఒకటో తారీఖు వరకూ జిల్లాలోని పోలీసు సిబ్బంది మొత్తానికి వైద్య పరీక్షలు పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు.

Tags: Medical tests, police personnel, mahaboobnagar, additional sp

Advertisement

Next Story