వలస కార్మికులను ఇబ్బంది పెడితే చర్యలు

by Shyam |
వలస కార్మికులను ఇబ్బంది పెడితే చర్యలు
X

దిశ, నల్గొండ: స్వగ్రామాలకు వచ్చే వలస కార్మికులను ఇబ్బంది పెడితే తగు చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి జిల్లాలోని గ్రామ సర్పంచ్‌లు, ఎంపీపీ, ఎంపీటీసీ, ఎంపీడీఓలు, రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వలస కార్మికులను గ్రామాల్లోకి రావొద్దంటూ ఆంక్షలు విధించడం సరికాదన్నారు. వైద్య పరీక్షల అనంతరమే వారు గ్రామాలను చేరుకుంటున్నారని స్పష్టం చేశారు. అలాగే, అనుమతి లేకుండా కొత్తగా గ్రామాలకు వచ్చే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వారి వివరాలను రిజిష్టరులో నమోదు చేసి అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఆయా గ్రామాలకు చేరుకున్న వలస కూలీలకు వెంటనే బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు అందజేసేలా చర్యలు తీసుకుంటామని సీపీ మహేశ్ భగవత్, జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ హామీ ఇచ్చారు.

Advertisement

Next Story