14 ఏళ్ల తర్వాత పెరిగిన అగ్గిపెట్టె ధర!

by Harish |   ( Updated:2021-10-24 00:36:47.0  )
Matchbox
X

దిశ, డైనమిక్ బ్యూరో: అగ్గిపెట్టే ధర ఎంత అంటే.. ఎవరైనా టక్కున రూ.1 అంటారు. దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుంచి అగ్గిపెట్టే ధరలు పెరగడం కానీ, తగ్గడం కానీ జరుగలేదు. దాంతో LKG పిల్లవాడి నుంచి పండు ముసలి వరకూ అగ్గపెట్టే ధరలపై అందరికీ క్లారిటీ ఉంది. అయితే, ఎన్నో ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అగ్గిపెట్టే ధరలు పెరగనున్నాయి. శివకాశిలోని ఆల్ ఇండియా ఛాంబర్ ఆఫ్ మ్యాచెస్ సంస్థ 14 ఏళ్ల తర్వాత అగ్గిపెట్ట ధరను పెంచేందుకు నిర్ణయించింది. పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకుని రూ.1 ఉన్న ధరను రూ.2 కు పెంచనున్నట్లు సంస్థ తెలిపింది. అగ్గిపెట్ట ధరను చివరిసారిగా 2007లో రూ.50 పైసల నుంచి రూ.1 పెంచారు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు, పెట్రో ధరలు పెరుగుతుంటే, అగ్గిపెట్ట ధరలు కూడా పెరగడంతో సామాన్యుడిపై భారం పెరగనుంది.

Advertisement

Next Story