టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అఫీషియల్స్ వీళ్లే..

by Shyam |
icc
X

దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా – న్యూజీలాండ్ మధ్య ఆదివారం రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగనున్నది. ఇప్పటి వరకు టీ20 కప్ గెలవని ఈ రెండు జట్లలో ఎవరు గెలిచినా.. కొత్త విజేత అవుతారు. కాగా, కీలకమైన ఈ మ్యాచ్‌కు సంబంధించిన మ్యాచ్ అఫీషియల్స్ వివరాలను ఐసీసీ వెల్లడించింది. దక్షిణాఫ్రికాకు చెందిన మారాయిస్ ఎరాస్మస్, ఇంగ్లాండ్‌కు చెందిన రిచర్డ్ కెటిల్‌బరో ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. ఇండియాకు చెందిన నితిన్ మీనన్ టీవీ అంపైర్‌గా.. శ్రీలంకకు చెందిన కుమార ధర్మసేన ఫోర్త్ అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇక రంజన్ మదుగలేను ఈ మ్యాచ్‌కు రిఫరీగా ఐసీసీ నియమించింది.

Advertisement

Next Story

Most Viewed