- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ-కామర్స్ రంగంలో భారీగా పెరిగిన ఉద్యోగాలు!
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ-కామర్స్ మార్కెట్ భారీగా పుంజుకుంది. పెరిగిన డిమాండ్ కారణంగా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ నియామకాలు జరిగాయి. పండుగ సీజన్ అమ్మకాల కోసం సుమారు 2.5 నుంచి 3 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు ఏర్పడ్డాయని టీమ్‌లీజ్ సంస్థ వెల్లడించింది. మే నెల నుంచి దీపావళి వరకు ఈ-కామర్స్ దిగ్గజ అమెజాన్ ఇండియా, ఇతర లాజిస్టిక్ సంస్థల్లో ఈ నియామకాలు జరిగాయని నివేదిక తెలిపింది. ఈ నియామకాలు గతేడాదితో పోలిస్తే 30-40 శాతం అధికమని పేర్కొంది.
లాక్‌డౌన్ సమయంలో ఈ-కామర్స్ నిర్వహణ దెబ్బతిన్నప్పటికీ, ఆన్‌లైన్ ద్వారా అవసరమైన వస్తువులను విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతించింది. కస్టమర్లు సైతం ఇంటికే పరిమితమై, ఆన్‌లైన్ కొనుగోళ్లు చేయడంతో ఈ ఉద్యోగాల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. టీమ్‌లీజ్ అంచనాల ప్రకారం, సాధారణ పండుగ సీజన్ సమయంలో నియమించే 15-20 శాతం ఉద్యోగాలు 2021లోనూ కొనసాగవచ్చని తెలిపింది.
సీజనల్ ఉద్యోగాలు సాధారణంగా మూడు నుంచి ఆరు నెలల పాటు కొనసాగుతాయి. ప్రస్తుత నియామకాలు పరిస్థితులను బట్టి మరికొంత కాలం కొనసాగవచ్చని టీమ్‌లీజ్ పేర్కొంది. ఆన్‌లైన్ కొనుగోళ్లకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో ఈ-కామర్స్ రంగంలో స్థిరమైన నియామకాలు ఉండొచ్చని పరిశ్రమ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అంతేకాకుందా ఈ-కామర్స్ మార్కెట్ వచ్చే ఏడాది 25 శాతం వృద్ధితో రూ. 3 లక్షల కోట్లకు చేరుకుంటుందని మార్కెట్ పరిశోధనా సంస్థ ఫారెస్టర్ తెలిపింది. ప్రస్తుత ఏడాది ఈ-మార్కెట్ 7-8 శాతం వృద్ధితో రూ. 2.4 లక్షల కోట్లుగా ఉంది. 2019లో ఈ మార్కెట్ 2.2 లక్షల కోట్లుగా నమోదైంది.