- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెదక్‌లో భారీ చోరీ.. కంటైనర్ నుంచి 2వేల ఫోన్లు లూటీ
దిశ, వెబ్‌డెస్క్: కంటైనర్ నుంచి భారీ మొత్తంలో స్మార్ట్‌ఫోన్లను దుండగులు దోచుకెళ్లారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ లూటీ మెదక్ జిల్లా చేగుంట సమీపంలోని జాతీయ రహదారి44 వద్ద జరిగింది. వివరాళ్లోకి వెళితే.. ఓ లారీ కంటైనర్ సహాయంతో కొత్త సెల్‌ఫోన్లను.. చెన్నై నుంచి ఢిల్లీకి ఎగుమతి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చెన్నై నుంచి బయల్దేరిన కంటైనర్ తెలంగాణ మీదుగా ఢిల్లీకి వెళ్తోంది.
అయితే, సరిగ్గా మెదక్ జిల్లా మాసాయిపేట వద్దకు రాగనే డ్రైవర్, క్లినర్ భోజనం చేసేందుకు ఓ దాబా వద్ద కంటైనర్‌ను ఆపారు. దుండగులు ఎప్పటి నుంచి లారీని ఫాల్ అయ్యారో తెలియదు కానీ.. డ్రైవర్ హోటల్ లోపలికి వెళ్లి వచ్చే లోపే రూ. 14 కోట్లు విలువ చేసే 2,442 సెల్‌ఫోన్లను లూటీ చేశారు. ఇది గమనించిన డ్రైవర్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఆధారంగా విచారణ చేపట్టారు. పథకం ప్రకారమే ఈ లూటీ జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.