కరోనా రిస్క్…బతుకమ్మ మాస్క్….

by Shyam |
కరోనా రిస్క్…బతుకమ్మ మాస్క్….
X

దిశ ప్రతినిధి, మెదక్:
బతుకమ్మ పండుగ సంబరాలను జిల్లాలో మహిళలు ఘనంగ జరుపుకున్నారు. అక్టోబర్ 16న ఎంగిలిపూలతో ప్రారంభమైన పూల పండుగ సంబురాలు శనివారం సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ చివరి రోజు సంబురాలకు మహిళలు సిద్ధమవుతున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఆడపడుచులు పరిమితంగా బతుకమ్మ ఆటలాడుతూ.. తీరొక్క పువ్వలతో గౌరమ్మను కొలిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే మాస్క్ ధరించిన బతుకమ్మ చూపరులను బాగా ఆకర్షిస్తోంది. గజ్వేల్ పట్టణంలోని దేశబోయిని వారి ఇంట ఈ బతుకమ్మ దర్శన మిచ్చింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భౌతికదూరం పాటించి, మాస్క్ ధరించి కరోనాను తరిమికొడుదామని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed