మూసాయి పేట రైల్వే గేటు ప్రమాదానికి నేటితో ఆరేళ్లు

by Sumithra |   ( Updated:2020-07-25 05:20:59.0  )
మూసాయి పేట రైల్వే గేటు ప్రమాదానికి నేటితో ఆరేళ్లు
X

దిశ, మెదక్: జిల్లా వెల్దుర్తి మండలంలోని మూసాయి పేట రైల్వే గేటు వద్ద స్కూల్ బస్సును రైలు ఢీకొన్న ఘటన నేటితో ఆరేళ్లు పూర్తయింది. ఈ ప్రమాదంలో 16 మంది విద్యార్థులు మృతిచెందారు. ఈ ఘటన ఇప్పటికీ కళ్లముందు మెదలుతూనే ఉంది. బస్సులో మొత్తం 34 మంది చిన్నారుల్లో ఉండగా డ్రైవర్, క్లీనర్‌తో పాటు 14 మంది చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. మరో 20 మంది చిన్నారులు తీవ్రంగా పడ్డారు. వీరిలో ఇద్దరు చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులంతా తూప్రాన్ మండలానికి చెందిన ఇస్లాంపూర్, గుండ్రెడ్డిపల్లి, వెంకటాయిపల్లి, కిష్టాపూర్ గ్రామాలకు చెందిన 13 ఏళ్లలోపు విద్యార్థులు. రైల్వేగేటు లేకపోవడం, రైలు వస్తున్న విషయాన్ని బస్సు డ్రైవర్ గుర్తించకపోవడం ముక్కుపచ్చలారని పసిమొగ్గల బంగారు భవిష్యత్తు గాల్లో కలిసింది. బస్సులో ఉన్న ప్రతి విద్యార్థికీ ఇనుపచువ్వలు గుచ్చుకోవడంతో ఆ ప్రాంతమంతా రక్తపు మడుగును తలపించింది. చిన్నారులను కోల్పోయిన తల్లిదండ్రులు గుండెకోతను మిగిల్చింది ఈ ఘటన.

Advertisement

Next Story

Most Viewed