ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య..

by Sumithra |
ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య..
X

దిశ,మునుగోడు: మనస్తాపం చెంది ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చండూరు మండలం గట్టుప్పల గ్రామంలో చోటు చేసుకుంది. మృతురాలి తండ్రి చెన్నయ్య తెలిపిన వివరాల ప్రకారం.. భూదాన్ పోచంపల్లి గ్రామానికి చెందిన చిలువేరు పావని(32)కి గట్టుప్పల్ గ్రామానికి చెందిన దశరథతో 2006 లో వివాహం జరిగింది. వీరికి కుమార్తె శ్రీనిధి(10), కుమారుడు శ్రీతేజ్(7) ఉన్నారు. కాగా సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పావని ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫోన్ ద్వారా చెన్నయ్యకు అల్లుడు దశరథం సమాచారం అందించాడు. దీంతో గట్టుపల్లి గ్రామానికి చెన్నయ్య వెళ్లి చుట్టపక్కల వారిని విచారించి వివరాలు తెలుసుకున్నాడు. కాగా సోమవారం ఉదయం పావని వాళ్ల ఇంటికి పావని ఆడపడుచు కొడుకు సంతోష్ వెళ్లాడు. తనను, తన తల్లిని పండుగకు ఎందుకు పిలవలేదనీ పావనితో సంతోష్ గొడవకు దిగాడు. వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో పావనిని సంతోష్ బూతులు తిట్టాడు. పావని తీవ్ర మనస్తాపానికి గురైంది. తన భర్త ఇంట్లో లేని సమయంలో పావని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పావని మరణానికి కారణమైన సంతోష్ పై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్ లో చెన్నయ్య ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చండూరు ఎస్ఐ ఉపేందర్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed