- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిజర్వేషన్లు ముందుగానే ప్రకటించాలి
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో త్వరలో నిర్వహించే గ్రేటర్‌తో పాటు కార్పోరేషన్ల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీ ఛైర్మన్ మర్రి శశిథర్ రెడ్డి కోరారు. టీపీసీసీ ఎన్నికల కమిటీ కో ఆర్డినేషన్ సమావేశం బుధవారం గాంధీ భవన్ నుంచి జరిగింది. జీహెచ్ఎంసీతో పాటు పలువురు నేతలు ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ ఛైర్మన్ శశిథర్ రెడ్డి మాట్లాడుతూ జీహెచ్ఎంసీలో వార్డులు పెంచుతారా, పాత వార్డులే ఉంచుతారా అనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉందన్నారు. వార్డుల పునర్విభజన ఎప్పుడు జరిగినా 2011 జనాభా లెక్కల ప్రకారమే జరగాలని చట్టంలో ఉందన్నారు.
గతంలో గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం అనుకూలంగా ఉండేలా చేసుకుందని, నోటిఫికేషన్ విడుదల చేసే కొద్ది గంటల ముందు రిజర్వేషన్లు ప్రకటించారని, అధికార పార్టీకి అనుకూలంగా రిజర్వేషన్లు చేసుకుంటున్నారని, గతంలో జనాభా లెక్కలకు సంబంధం లేకుండా రిజర్వేషన్లు మార్పులు, చేర్పులు చేశారని గుర్తు చేశారు. ఈసారి ప్రభుత్వం అదే విధంగా చేస్తే పోరాటం చేయాలని, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ముందుగానే ప్రకటించాలని శశిథర్ రెడ్డి డిమాండ్ చేశారు. అధికార పార్టీ ఈసారి కూడా తమ నేతలకు అనుకూలంగా రిజర్వేషన్లు చేసుకుంటుందని, రిజర్వేషన్ల ప్రకటనకు ముందు అభ్యంతరాల స్వీకరణకు 15రోజుల సమయం ఇవ్వాలని సూచించారు. పలు అంశాలపై త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికల కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్లను కలుస్తామన్నారు.