మంథని 'రాష్ట్రపతి' మృతి

by Sridhar Babu |   ( Updated:2020-03-29 06:37:01.0  )
మంథని రాష్ట్రపతి మృతి
X

దిశ, కరీంనగర్: పెద్దపెల్లి జిల్లాలో మంథని రాష్ట్రపతిగా పిలువబడే ‘రాష్ట్రపతి హోటల్’ యజమాని కజ్జం మల్లయ్య అనారోగ్యంతో మృతి చెందారు. పెగడపల్లికి చెందిన మల్లయ్య.. 45 ఏండ్ల క్రితం మంథనిలో హోటల్‌ ప్రారంభించారు. ఆయన మాటలు ఆర్డర్ వేసినట్టుగా ఉండటంతో ఆయనకు రాష్ట్రపతి అనే పేరు వచ్చింది. అప్పట్నుంచీ ఆయన నిర్వహిస్తున్న హోటల్‌‌నూ రాష్ట్రపతి హోటల్‌గానే స్థానికులు పిలిచేవారు. ఆయన చేసే పూరీలు, ఆలూ కుర్మ మంథనిలో చాలా ఫేమస్. అనతి కాలంలో పట్టణంలోని ప్రజలందరికీ మల్లయ్యతో మంచి అనుబంధం ఏర్పడింది. అందుకే, కరోనా భయం వెంటాడుతున్నా రాష్ట్రపతికి నివాళులర్పించేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు కూడా నివాళులు అర్పించారు. కాగా, మల్లయ్యకు ముగ్గురు కుమారులు, నలుగురు కూతుర్లు సంతానం. ఆయన పెద్దకొడుకు రాష్ట్రపతి2 పేరిట మరో హోటల్ నిర్వహిస్తుండగా, చిన్న కొడుకు తండ్రి నిర్వహించిన హోటల్‌నే నడిపిస్తున్నారు.

Tags: manthani rastrapathi, kajjam mallaiah, rastrapaathi hotel, pegadapelly

Advertisement

Next Story

Most Viewed