తాళి తెంపుకుని పరారైన భర్త.. భార్య ఏం చేసిందంటే..?

by Sridhar Babu |
Wife suicide attempted
X

దిశ, వెబ్‌డెస్క్ : జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తాళి కట్టిన భర్తే భార్య మెడలో ఉన్న తాళిని తెంపుకుని వెళ్లాడు. భర్త చర్యతో షాక్ తిన భార్య ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. స్థానికుల అప్రమత్తతతో ఆమె ప్రాణాలు నిలిచాయి. స్థానికులు, బంధువులు తెలిపిన అందించిన సమాచారం ప్రకారం..

నాగమణి(25)ది కోరుట్ల మండలం గంభీర్ పూర్. ఆమెకు కొన్నేళ్ల క్రితం రాజేందర్‌తో వివాహం అయింది. కొన్నేళ్ల వరకు సజావుగా సాగిన వీరి కాపురంలో మనస్పర్థాలు వచ్చాయి. తరుచూ భార్యభర్తల మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో భర్త రాజేందర్ మరో యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. దీంతో గొడవలు తీవ్రస్థాయికి చేరాయి. తాజాగా ఇరువురి మధ్య గొడవ జరగడంతో భర్త రాజేందర్.. నాగమణి మెడలో ఉన్న పుస్తెల తాడును తెంపుకుని పారిపోయాడు.

ఈ హఠాత్ పరిణామంతో షాక్ తిన్న నాగమణి.. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. గంభీర్పూర్ నుంచి కోరుట్ల ఉన్న పెద్ద కాల్వ వద్దకు వెళ్లింది. దాంట్లో దూకి ప్రాణాలు తీసుకోవాలనుకున్న ఆమె.. స్పృహతప్పి కాల్వ పక్కన పడిపోయింది. సమీపంలో ఉన్న రైతులు గమనించి ఆమెకు సపర్యలు చేశారు. ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత వివరాలు తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు నాగమణిని ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story