- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘మా’ సభ్యుల్లో టెన్షన్ టెన్షన్.. పోస్టల్ బ్యాలెట్‌లో ఎవరు ముందున్నారంటే..?
దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు చిత్ర పరిశ్రమలో జూబ్లీ పబ్లిక్ స్కూల్లో ఆదివారం జరిగిన ‘మా’ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో మంచు విష్ణు ప్యానెల్ ముందంజలో నిలిచింది. మరికొన్ని క్షణాల్లో ఈసీ మెంబర్ల ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటివరకు ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌లో ఈసీ మెంబర్లుగా శివారెడ్డి, కౌశిక్ గెలిచినట్టు అధికారులు ప్రకటించారు. చివరాఖరులో మా ప్రెసిడెంట్ ఫలితాన్ని ప్రకటించనున్నారు. పోలైన మొత్తం 665 ఓట్లలో 50 చెల్లనివిగా ఎన్నికల అధికారులు గుర్తించారు.
ఈసారి మా ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్టు అధికారులు తెలిపారు. ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైం అని తెలుస్తోంది. కాగా, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు కౌంటింగ్ సమయంలో ఇబ్బందులు సృష్టిస్తున్నారనే నెపంతో నటుడు మోహన్ బాబు వారిని హెచ్చరించారు. అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారిని అక్కడి నుంచి బయటకు పంపించి వేసినట్టు తెలుస్తోంది. అయితే, ప్రస్తుత మా ప్రెసిడెంట్ నరేష్ తర్వాతి అధ్యక్షుడు ఎవరనేది తెలియాలంటే మరికొంత సమయం వేచిచూడాల్సిందే.