- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సేవాతత్వానికి ఆదర్శమే మనం ఫౌండేషన్..!
దిశ, గజ్వేల్: సమాజానికి తన వంతు చేయూతను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న మనం ఫౌండేషన్‌ను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ కోరారు. గజ్వేల్ మండలం సింగాటం గ్రామానికి చెందిన శ్రీనాథ్ అనే పేద విద్యార్థి పాండిచ్ఛేరి సెంట్రల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. ఫ్రాన్స్‌లోని ఓ ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కడే ఎంపికయ్యాడు. మరికొద్ది రోజుల్లో పారీస్ వెళ్లాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో ఆన్లైన్ కోర్సు కోసం శ్రీనాథ్‌కు ల్యాప్‌టాప్ అవసరమైంది. ల్యాప్‌టాప్‌ను కొనే స్థోమత లేని శ్రీనాథ్‌కు మనం ఫౌండేషన్‌కు చేయూతనిచ్చింది. గజ్వేల్ ప్రెస్‌క్లబ్ ప్రాంగణంలో సోమవారం విరాహత్ అలీ చేతుల మీదుగా శ్రీనాథ్‌కు ల్యాప్‌టాప్ అందించారు. ఈ సందర్భంగా విరాహత్ అలీ మాట్లాడుతూ.. నేటి సమాజంలో పేద ప్రజల క్షేమాన్ని కాంక్షించే నాథులే కరువైపోయినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో శ్రీనాథ్‌కు గజ్వేల్ ప్రెస్‌క్లబ్ అండగా ఉంటుందని తెలిపారు.