- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏకే 47ను అలా ఎత్తుకెళ్లాడన్నమాట…!
ఏకే 47తో కాల్పులు జరిపి పరారైన నిందితుడ్ని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులైతే పట్టుకున్నారు కానీ.. సాధారణ వ్యక్తిని ఏకే 47 చేరిన వైనంతో పాటు పోలీసుల అప్రమత్తత, సమర్థపై ప్రశ్నలు లేవనెత్తుతున్న అక్కన్నపేట ఘటన ఎట్టకేలకు సుఖాంతమైంది. పోలీసు కస్టడీలో ఎటువంటి వివరాలు వెల్లడవుతాయో చూడాల్సి ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే…
సదానందం మొదటి భార్య విడాకులకు ముందు హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో సదానందంను కౌన్సెలింగ్ కోసం సీఐ ఆఫీసుకు పలుమార్లు పిలిపించారు. దీంతో పలుమార్లు పోలీస్ స్టేషన్ కు వచ్చిన సదానందంకి అక్కడి పోలీసులతో మంచి సంబంధాలు ఏర్పడేలా చేసింది. దీంతో 2016లో ఏకే 47తో పాటు కార్డైన్ గన్ ను కూడా సదానందం తీసుకెళ్లిపోయాడు. పోలీసుల ఆధీనంలో ఉండాల్సిన గన్ లు కనపడకుండా పోవడంతో తేలుకుట్టిన దొంగల్లా గప్ చుప్ గా ఉండిపోయారు.
తుపాకులు పట్టుకెళ్లిపోయిన సదానందం చాలా జాగ్రత్తగా వాటిని దాచాడు. ఎవరికీ అనుమానం రాకుండా, తానెప్పుడూ నోరు జారకుండా జాగ్రత్తపడ్డాడు. అయితే కాంపౌండ్ వాల్ కట్టే క్రమంలో జరిగిన పంచాయతీ వివాదంతో ప్రత్యర్థిపై కాల్పులు జరిపాడు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కాల్పుల కలకలం రేగింది. సాధారణ గొర్రెల కాపరి వద్దకు ఏకే 47 ఎలా వచ్చిందన్న ఆందోళనతో పోలీసులు ఆఘమేఘాలమీద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. సదానందంను అరెస్టు చేసిన తరువాత తుపాకీ గుట్టు వీడింది.
అయితే 2016లో ఏకే 47, కార్డైన్ గన్ చోరీకి గురైతే ఆయుధాలు మాయమైనట్టు పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదు. ఆయుధాలెప్పుడు చోరీ అయ్యాయో తెలియకపోయినప్పటికీ, ఆయుధాల లెక్కింపు సమయంలో తెలిసే ఉండాలి, అప్పుడు కూడా ఎందుకు అలసత్వం ప్రదర్శించారు. ఆయుధాల చోరీ కేసు ఛేదించినప్పటికీ.. ఈ తుపాకుల గుట్టు విప్పేందుకు సదానందం భార్యను కూడా అదుపులోకి తీసుకుని విచారించాలని పోలీసులు నిర్ణయించారు. దీంతో అతని భార్య కృష్ణవేణిని కూడా అదుపులోకి తీసుకుని విచారస్తున్నారు. మరోవైపు అప్పటి గన్ మెన్ నరేందర్ ను కూడా పోలీసులు విచారిస్తున్నారు.