- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్యను గంటల చొప్పున అమ్మకానికి పెట్టిన భర్త
దిశ, వెబ్‌డెస్క్ : తిరుపతిలో ఓ శాడిస్ట్ భర్త రెచ్చిపోయాడు. భార్య నగ్నచిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వ్యభిచారినిగా చిత్రీకరించాడు. పెళ్లైన మూడో రోజు నుంచే తన శాడిజాన్ని భార్యపై చూపిస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. అతడి వేధింపులు భరించలేక పుట్టింటికి వెళ్లిన భార్యపై అసభ్యకరంగా పోస్టులు పెట్టి అల్లరిపాలు చేశాడు.
తిరుపతి పట్టణానికి చెందిన రేవంత్ కుమార్ స్థానికంగా ఓ కాలేజీలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. ఆయనకు గత ఆగస్ట్ 13న ఓ యువతితో వివాహం జరిగింది. పెళ్లైన మూడో రోజుకే అతని విశ్వరూపం బయటపడింది. కట్న కానుకలు సరిపోలేదని, అదనపు కట్నం తేవాలని భార్యను విచక్షణారహితంగా బెల్ట్ తీసుకొని కొట్టేవాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. గర్భవతి అయిన భార్యను శారీరకరంగా హింసిచడంతో అబార్షన్ జరిగినట్లు బంధువులు చెబుతున్నారు. అతడి వేధింపులు తట్టుకోలేక భార్య నెల రోజుల క్రితం దిశ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి, పుట్టింటికి వెళ్లింది.
భార్య పుట్టింటికి వెళ్లడాన్ని జీర్ణించుకోలేని రేవంత్ కుమార్ .. ఆమె నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆమెను ఓ కాల్ గ్లర్ గా చిత్రీకరించి, గంటకు ఇంత రేటు అని కాలేజీ గ్రూపుల్లో షేర్ చేశాడు. తనను పెళ్లి చేసుకొని వేరే వాళ్లతో వెళ్లిపోయిందని ప్రచారం చేశాడు. విషయం తెలుసుకున్న భార్య.. రేవంత్ కుమార్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. అతడి అకృత్యాలు, వేధింపులపై దిశ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఎస్ఐ హిమబిందు పట్టించుకోలేదని ఆమె ఆరోపించింది. ఆమె ఆందోళనకు మహిళా సంఘాలు, స్థానిక మహిళలు మద్దతు తెలిపారు. పోలీసులు రంగప్రవేశం చేసి రేవంత్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు.