- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఐసీయూలో పెళ్లి చేసుకున్న ప్రేమికులు
దిశ, వెబ్ డెస్క్: ఓ ఏరియాలో కరోనా కేసు వచ్చిందంటే చాలు.. జనాలు ఆ వైపుగా వెళ్లడమే మానేస్తున్నారు. ఇక ఇంట్లో ఓ వ్యక్తికి కరోనా వచ్చిందంటే.. ఆస్పత్రిలో జాయిన్ చేసిన తర్వాత అతడిని కలవడానికి కూడా కుటుంబ సభ్యులు జంకుతున్నారు. కరోనా పేషెంట్ల వద్దకు వెళ్లేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాంటిది కరోనా సోకి హాస్పిటల్‌లో ఉన్నా.. తన ప్రేమికుడిని పెళ్లి చేసుకుని ఔరా అనిపించింది ఓ ప్రేయసి. తమ ప్రేమకు కరోనా అడ్డురాదంటూ నిరూపించింది.
నేటితరంలో టైమ్ పాస్ ప్రేమలతో.. ‘ప్రేమ’కు అర్థాలే మారిపోతున్నాయి. ప్రేమించామంటూ వెంటపడటం, ప్రేమించాలంటూ వేధించడం, ప్రేమను ఒప్పుకోకపోతే.. ఆ అమ్మాయిపై అటాక్ చేయడం లేదా ప్రేమ కోసం ఆత్మహత్య చేసుకోవడం.. ఇవేవీ ప్రేమకథలు అనిపించుకోవు. అసలు అదంతా ప్రేమే కాదు. ప్రేమంటే కలిసి బతకడం.. కష్టసుఖాల్లో ఒకరికొకరు అండగా, నమ్మకంగా ఉండటం. ఆ నమ్మకాన్నే నిలబెట్టుకున్నారు అమెరికాలోని టెక్సాక్‌కు చెందిన కార్లోస్ మునిజ్, గ్రేస్‌లు. వీళ్లిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. కానీ కరోనా వీరి పెళ్లికి కొంతకాలం బ్రేక్ వేసింది. కార్లోస్‌కు కరోనా సోకడంతో.. జూలై 15న ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. రోజులు గడుస్తున్న కొద్దీ కార్లోస్ పరిస్థితి మెరుగుపడకపోగా.. అతడి ఆరోగ్యం మరింత దిగజారిపోయింది. దాంతో నార్మల్ వార్డు నుంచి ఐసీయూకీ షిఫ్ట్ చేశారు. కానీ తన ఆరోగ్య పరిస్థితి వల్ల కార్లోస్ మానసికంగా కృంగిపోయాడు. అది గమనించిన హాస్పిటల్ సిబ్బంది.. కార్లోస్‌తో తరుచుగా మాట్లాడుతూ ఉత్సాహపరిచేవారు. ఈ క్రమంలోనే కార్లోస్, గ్రేస్‌ల ప్రేమ, పెళ్లి విషయాలు తెలుసుకుని ఆస్పత్రి సిబ్బందే వారి పెళ్లి చేయడానికి నిశ్చయించుకున్నారు.
గ్రేస్‌కు ఈ విషయం చెప్పగానే ఆమె కూడా ఒప్పుకుంది. ‘డార్లింగ్.. నువ్వు ఎలా ఉన్నా నీమీద నాకున్న ప్రేమ తగ్గదు. ఎందుకంత బాధపడుతున్నావ్.. నీకోసం నేనున్నాను.. నిన్ను ఈ క్షణమే పెళ్లి చేసుకోవటానికి నేను రెడీ’ అంటూ ధైర్యం చెప్పడమే కాకుండా, పెళ్లి కూడా చేసుకుంది. ఇందుకు హాస్పిటల్ సిబ్బంది ఐసీయూలోనే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలా వారిద్దరికీ ఐసీయూలోనే 11 ఆగస్టు, 2020న వివాహం జరిగింది. ఇరువురి తల్లిదండ్రులు కూడా ఈ వివాహానికి హాజరుకావటానికి హాస్పిటల్ యాజమాన్యం అనుమతినివ్వటంతో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో కార్లోస్, గ్రేస్ ఒక్కటయ్యారు.
పెళ్లి తరువాత చిత్రంగా కార్లోస్ చక్కగా కోలుకోవటం ప్రారంభించాడు. కార్లోస్ మానసిక ఒత్తిడి నుంచి బయటపడటంతోనే త్వరగా కోలుకున్నాడని హాస్పిటల్ సిబ్బంది తెలిపారు. ప్రేమకు ఉన్న శక్తి అలాంటిది మరి..