- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పెట్ డాగ్ కోసం.. టోటల్ బిజినెస్ క్లాస్ బుక్
దిశ, ఫీచర్స్ : ఒత్తిడిలో ఉంటే.. స్ట్రెస్ బస్టర్‌గా నిలుస్తాయి. ఉద్యోగ బాధ్యతలతో అలిసిపోయి వస్తే, ఎక్కడలేని ఉత్సాహాన్ని మనలో నింపుతాయి. బయటకెళుతుంటే బై..బై చెప్పేస్తాయి. కనిపిస్తే చాలు ప్రేమను కురిపిస్తాయి. కాస్త ఆదరణ చూపితే.. కొండంత ప్రేమను పంచుతాయి. వాటి పుట్టినరోజంటే ఇంట్లో పండుగ రోజే. ఇంట్లోని బిడ్డలతో పాటు ఎంతో అపురూపంగా చూసుకునే ఆ ఆప్తమిత్రులే ‘పెట్స్’. వాటికి ఏ లోటు రాకుండా చూసుకోవడమే కాదు, యావదాస్తిని వాటి పేరు మీదే రాసేసిన సందర్భాలు బోలెడు. ఈ క్రమంలోనే ఓ పెట్ ఓనర్, తన శునకం కంఫర్ట్‌గా ప్రయాణించడం కోసం ఏకంగా బిజినెస్ క్లాస్ క్యాబిన్ మొత్తాన్ని బుక్ చేయడం విశేషం.
ముంబై నుంచి చెన్నయ్‌కి వెళ్లే ఎయిర్ ఇండియా A320 విమానంలోని జె-క్లాస్ క్యాబిన్‌లో 12 సీట్లు ఉండగా, తన పెంపుడు శునకం ‘బేలా’ ఎలాంటి ఇబ్బంది లేకుండా లగ్జరీ క్లాస్‌లో ప్రయాణించేందుకు ఆ టికెట్లన్నీ బుక్ చేసింది దాని యజమాని. ఇందుకోసం ఆమె దాదాపు రూ. 2.4 లక్షలు ఖర్చు చేసింది.
పెంపుడు జంతువులు విమానంలో తీసుకెళ్లడంలో ఇదేం మొదటిసారి కాదు. అదే విధంగా ప్రయాణికులు తమ పెంపుడు జంతువును విమానం లోపల తీసుకెళ్లడానికి అనుమతించే ఏకైక భారతీయ ఎయిర్‌లైన్ సర్వీస్ ‘ఎయిర్ ఇండియా’. ప్రజలు ఎయిర్ ఇండియా విమానంలో గరిష్టంగా రెండు పెంపుడు జంతువులను తీసుకువెళ్లడానికి పర్మిషన్ ఉంది. సాధారణంగా పెట్ వెంట తెచ్చుకునే వారికి టికెట్ బుక్ చేసిన క్లాస్‌లో చివరి వరుసలో సీటు ఇస్తారు. అలాగే, ప్రయాణీకులు ఈ సేవ కోసం కొంత అదనపు చార్జీని చెల్లించాలి. అయితే పెంపుడు జంతువు కోసం మొత్తం బిజినెస్ క్లాస్ క్యాబిన్‌ను బుక్ చేయడం మాత్రం ఇదే మొదటిసారి. ఇదోక రికార్డు! గతేడాది జూన్ – సెప్టెంబర్ మధ్య ఎయిర్ ఇండియా తన దేశీయ విమానాలలో దాదాపు 2000 పెంపుడు జంతువులకు అనుమతిచ్చింది.