- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అత్తతో కలిసి మద్యం తాగుతోందని…..
దిశ, వెబ్‌డెస్క్: అత్తతో కలిసి మద్యం తాగేందుకు ఓ మహిళ తరచూ తన ఇంటికి వస్తోందని కోపం పెంచుకున్న వ్యక్తి ఆమెపై కత్తితో దాడి చేశాడు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఒంగోలు హౌసింగ్‌బోర్డు కాలనీలో నివాసం ఉంటోన్న హరికృష్ణ సెంట్రింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని ఇంట్లోనే అత్త కూడా కొన్నేళ్ల నుంచి ఉంటోంది. ఇదేక్రమంలో హరికృష్ణ అత్తకు.. దర్శికి చెందిన మహిళ శివమ్మతో పరిచయం ఏర్పడింది. శివమ్మ తరచూ ఇంటికి వచ్చి తన అత్తకు మద్యం తాపిస్తోందన్న కోపంతో ఆమెను చాలాసార్లు హెచ్చరించాడు. తన ఇంటికి రావొద్దని చెప్పాడు. కానీ అతని మాట పట్టించుకోని ఇద్దరు మహిళలు మద్యం సేవిస్తుండటంతో హరికృష్ణ కొద్దిరోజులుగా కోపంతో రగిలిపోతున్నాడు.
ఈ నేపథ్యంలో ఈనెల 9న శివమ్మ ఆటోలో వెళ్తుండగా గమనించిన హరికృష్ణ.. ఆమెను కిందకు దించి బైక్‌పై తీసుకెళ్లి మద్యం తాగించాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న కత్తితో రెండు మూడు పోట్లు పొడిచి పరారయ్యాడు. తీవ్రగాయాలతో చావు బతుకుల మధ్య ఉన్న శివమ్మను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న మహిళ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. వెంగముక్కలపాలెంలో ఉన్న నిందితుడు హరికృష్ణను అరెస్ట్ చేసిన పోలీసులు బైక్, కత్తిని స్వాధీనం చేసుకున్నారు.