- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీచర్‌పై కన్నేసిన సర్పంచ్ భర్త.. పొలానికి వెళ్లే దారిలోకి తీసుకెళ్లి..
దిశ, అచ్చంపేట : గ్రామంలో విద్యాబుద్ధులు నేర్పుతున్న ఓ ఉపాధ్యాయురాలిపై ఆ గ్రామ సర్పంచ్ భర్త వ్యామోహం పెంచుకున్నాడు. ఎలాగైనా వశపరచుకోవాలని కుట్ర చేశాడు. నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట మండల పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల ప్రకారం.. అచ్చంపేట నియోజకవర్గం సిద్దాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల దేవల తండా గ్రామంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉపాధ్యాయురాలు రోజూ మాదిరిగానే రెండు రోజుల క్రితం పాఠశాలకు హాజరు అయ్యారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన సర్పంచ్ భర్త పంత్ లాల్.. ఆమెకు సిద్దాపూర్ గ్రామం వరకు బైక్‌పై లిఫ్ట్ ఇస్తానని చెప్పాడు.
ఈ క్రమంలో ఆమెను బైక్‌పై ఎక్కించుకుని సిద్దాపూర్ వైపు వస్తుండగా మార్గమధ్యలోనే వ్యవసాయ పొలాలకు వెళ్లే దారిలోకి బైక్‌ను తీసుకెళ్లాడు. ఆమె వెళ్లే దారి అటు వైపు కాకపోవడంతో అనుమానం వచ్చిన టీచర్ బైక్ ఆపాలని కేకలు వేసింది. ఈ బైక్ కాస్త నెమ్మది కాగానే బైక్‌పై నుంచి కిందకు దూకి తప్పించుకున్నట్టు టీచర్ తెలిపారు.
అనంతరం సిద్దాపూర్ ప్రధాన రోడ్డుకు చేరుకొని మరో వ్యక్తి సహాయంతో తాను నివాసం ఉంటున్న అచ్చంపేట ప్రాంతానికి చేరుకున్నట్టు చెప్పారు. అనంతరం జరిగిన విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు వెల్లడించారు. దీంతో బాధితురాలు, కుటుంబ సభ్యులు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు
సర్పంచ్ భర్త పంతు లాల్‌కు దేహశుద్ధి..
విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహానికి గురై.. కీచక చర్యకు పాల్పడేందుకు కుట్ర చేసిన సర్పంచ్ భర్తను పట్టుకొని తగిన దేహశుద్ధి చేసినట్టు తెలిసింది.
ఎస్ఐ వివరణ..
ఈ ఘటనపై సిద్దాపూర్ ఎస్ఐ గురుస్వామిని ‘దిశ’ రిపోర్టర్ ఫోన్ ద్వారా వివరణ కోరగా జరిగిన విషయం వాస్తవమేనని ఆయన తెలిపారు. ఉపాధ్యాయురాలు గురువారం రాత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సర్పంచ్ భర్త పంతు లాల్‌ను అదుపులోకి తీసుకుని విచారించినట్టు పేర్కొన్నారు. శుక్రవారం కేసు నమోదుచేసి, కోర్టులో హాజరు పరచి అనంతరం రిమాండ్‌కు తరలించామని ఎస్ఐ తెలిపారు.