- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దీదీ ఎన్నికల ప్రచారానికి బ్రేక్.. ఆ ఒక్కరోజే సభ
కోల్‌కతా : అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న పశ్చిమబెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)కి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఇకనుంచి ఎన్నికల ర్యాలీలకు దూరంగా ఉండనున్నారు. కోల్‌కతాలో ఈనెల 26న నిర్వహించతలపెట్టిన సభే ఆమె ఆఖరు ఎన్నికల ప్రచార సభ అని టీఎంసీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ ఆదివారం తెలిపారు. రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటమే దీనికి కారణంగా తెలుస్తున్నది.
ఈ మేరకు డెరెక్ ఒబ్రెయిన్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ‘కోల్‌కతాలో మమతా బెనర్జీ ఇక ఎన్నికల ప్రచారసభలు నిర్వహించరు. ఏప్రిల్ 26న జరిగే ర్యాలీయే ఆమె ఆఖరు ర్యాలీ. అది కూడా త్వరగానే ముగుస్తుంది. దీంతోపాటు అన్ని జిల్లాలలో ఆమె నిర్వహించే ర్యాలీలను 30 నిమిషాలకు కుదించాం..’ అని ట్వీట్ చేశారు. బెంగాల్ లో ఆదివారం రికార్డు స్థాయిలో 8,419 కేసులు నమోదయ్యాయి. ఎన్నికల ర్యాలీల కారణంగా వైరస్ వ్యాప్తి కూడా విజృంభిస్తుందని ఆందోళన నెలకొన్న నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులు వారి ప్రచారాలను రద్దు చేసుకుంటున్న విషయం విదితమే. ఇప్పటికే సీపీఐ(ఎం) తో పాటు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వారి ఎన్నికల ప్రచార ర్యాలీలను రద్దు చేసుకున్నారు. తాజాగా ఈ జాబితాలో మమతా బెనర్జీ కూడా నిలవడం గమనానర్హం.