ఉద్రిక్తతకు దారితీసిన "సేవ్ ఇండియా కై జైల్ బరో"

by Shyam |
ఉద్రిక్తతకు దారితీసిన సేవ్ ఇండియా కై జైల్ బరో
X

దిశ, సూర్యాపేట: కేంద్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ అన్నారు. సీఐటీయూ, ప్రజా సంఘాల అధ్వర్యంలో సూర్యాపేట బస్టాండ్ వద్ద చేపట్టిన “సేవ్ ఇండియా కై జైల్ బరో”కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ సందర్భంగా మల్లు లక్ష్మీ మాట్లాడుతూ.. రాష్ట్రాలకు నిధులు, మాస్కులు, శానిటైజర్లు అందించడం లేదని ఆరోపించారు. విద్యుత్, పెట్రోలు, డిజిల్ ధరలను పెంచడంతో ప్రజలపై మోయలేని భారం పడుతుందన్నారు.

ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా పేదలకు వైద్యం అందించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీసీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యుడు ములకలపల్లి రాములు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోలిశెట్టి యాదగిరి రావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు, కేవిపీఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి, వృత్తి సంఘాల జిల్లా నాయకుడు గోవింద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story